News June 13, 2024
తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం

తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) ఎమ్మెల్సీగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తీన్మార్ మల్లన్నను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం మల్లన్నను ఎంపీ చామల శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News November 7, 2025
NLG: వేతన బకాయిల కోసం ఎదురుచూపులు

చాలీచాలని వేతనాలు.. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల కారణంగా పెట్టిన పెట్టుబడి రాక మధ్నాహ్న భోజన పథకం నిర్వాహకులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. వీటికి తోడుగా గత 6 నెలలుగా జిల్లా వ్యాప్తంగా వేతన బకాయిలు రాకపోవడంతో మధ్నాహ్న భోజన పథకం నిర్వాహకులకు నిర్వహణ మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరాణ దుకాణాల నుంచి సరుకులు అరువు తెచ్చి భోజనం వండుతున్నామని తెలిపారు.
News November 7, 2025
పోలీస్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన

వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో శుక్రవారం గీతాలాపన కార్యక్రమం జరిగింది. పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ పూర్తిస్థాయి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. 1875 నవంబర్ 7న బంకిం చంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని రచించారని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.
News November 7, 2025
Way2News కథనానికి నల్గొండ కలెక్టర్ స్పందన

‘ఇసుక కొరత.. ఇంటి నిర్మాణం జరిగేది ఎట్లా?’అనే శీర్షికతో ఈ నెల 4న Way2Newsలో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మైనింగ్ శాఖ అధికారులు జిల్లాలోని ఇసుక రీచ్లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.


