News June 13, 2024
తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం

తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) ఎమ్మెల్సీగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తీన్మార్ మల్లన్నను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం మల్లన్నను ఎంపీ చామల శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News March 21, 2025
టెన్త్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్‌లో ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లతో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి కేటాయించిన విద్యార్థులు, హాజరైన విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి పాల్గొన్నారు.
News March 21, 2025
నల్గొండ: మొదటి రోజు పరీక్షకు 40 మంది విద్యార్థుల గైర్హాజరు

నల్గొండ జిల్లా వ్యాప్తంగా 105 సెంటర్లలో నేడు ప్రారంభమైన పదవ తరగతి మొదటి రోజు పరీక్షకి 18511 విద్యార్థులకు గాను 18471 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాధికారి బిక్షపతి తెలిపారు. మొత్తం 40 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. హాజరు శాతం 99.78 % నమోదు అయిందని, జిల్లా అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 49 సెంటర్లను సందర్శించారని తెలిపారు.
News March 21, 2025
NLG: GOOD NEWS.. తీరనున్న తాగునీటి సమస్య

వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకుగాను, తాగునీటి బోర్లు, చేతిపంపులు, పైపులైన్లు, తాగునీటి ట్యాంకుల మరమ్మతులకు గాను జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో 827 తాగునీటి పనులు చేపట్టేందుకు DMFT నిధుల నుంచి రూ.5 కోట్ల 10 లక్షలను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎక్కడా తాగునీటికి సమస్య రాకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.