News September 8, 2024
తీరప్రాంతంలో పర్యటించిన ప్రకాశం ఎస్పీ దామోదర్
వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ వెల్లడించారు. ఆదివారం కొత్తపట్నం తీర ప్రాంతంలో జరిగే నిమజ్జనాల ప్రదేశాలను ఆయన పరిశీలించారు. నిమజ్జన ప్రక్రియలో ఎలాంటి అవంతరాలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో సురక్షిత వినాయక నిమజ్జనానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
Similar News
News October 5, 2024
ఒంగోలులో ఈనెల 8న మినీ జాబ్ మేళా
జిల్లా ఉపాధి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృధి సంస్థ, సీడప్ ఒంగోలువారి ఆధ్వర్యంలో అక్టోబరు 8న, ఒంగోలు ప్రభుత్వ బాలికల ITI కాలేజీలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు.ITI, డిడిప్లొమా, టెన్త్, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి 18 సం. నుంచి 30సం. లోపు మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులని జిల్లా అధికారులు రవితేజ, భరద్వాజ్‌లు తెలియజేశారు.
News October 5, 2024
ఒంగోలు ట్రిపుల్ ఐటీకి 6 నుంచి దసరా సెలవులు
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న ఒంగోలు, నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు, ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ శనివారం తెలిపారు. తిరిగి క్లాసులు ఈనెల 14 నుంచి పునః ప్రారంభమవుతాయని చెప్పారు.
News October 5, 2024
ప్రకాశం: టెట్ పరీక్షలకు 63 మంది గైర్హాజరు
ప్రకాశం జిల్లాలో టీచర్స్ ఎలిజిబులిటీ టెస్టు రెండో రోజు శుక్రవారం పరీక్షలకు 63 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి బి సుభధ్ర తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు సెంటర్లలో పరీక్షలు జరిగాయి. సాయంత్రం సెషన్‌లో మాత్రమే ఈ పరీక్షలు జరగ్గా, 520 మందికి గానూ 457 మంది మాత్రమే హాజరయ్యారని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని డీఈవో తెలిపారు.