News March 2, 2025
తీర్యాణి: మావోయిస్టులకు సహకరించకండి: ఏఎస్పీ

యువత, ప్రజలు మావోయిస్టుల ప్రలోభాలకు లోనై, వారికి సహకరించవద్దని ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ సూచించారు. ఆదివారం మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాలైన గోవేన, కుర్సీగూడ, నాయకపుగూడ గ్రామాల్లో ఆయన పర్యటించారు. మొత్తం అటవీ ప్రాంతం కావడంతో దాదాపు 20 కి.మీ. దూరం కాలినడకన వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలను ఇంట్లో ఉంచకుండా పాఠశాలకు క్రమం తప్పకుండా పంపాలని సూచించారు.
Similar News
News March 18, 2025
ఈడీ వద్దకు చేరిన బెట్టింగ్ యాప్స్ కేసు

బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వివరాలపై ఈడీ ఆరా తీసింది. చెల్లింపుల వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకుంది. హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది. 11 మంది వివరాలు సేకరించి.. ఎవరెవరికి ఎంత డబ్బులు ముట్టాయని ఈడీ ఆరా తీస్తోంది.
News March 18, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>చింతపల్లి: తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ>పాపికొండల విహార యాత్రలో నైట్ హాల్ట్ లేదు>దేవీపట్నం: పొలంలో ధాన్యం చోరీ>పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయండి>రాజవొమ్మంగి: చింతపండుకు మద్దతు ధర పెంచాలి>ముంచంగిపుట్టులో తాగునీటి కోసం గిరిజనుల కష్టాలు>అరకు: అసెంబ్లీలో జీసీసీ స్టాల్ ప్రారంభం>పాడేరు: అంగన్వాడీ టీచర్, ఆయాలను నియమించండి>రాజవొమ్మంగిలో యువతి ఆత్మహత్య
News March 18, 2025
నంద్యాల జిల్లాలో నేర నియంత్రణే లక్ష్యంగా విజువల్ పోలీసింగ్: ఎస్పీ

నంద్యాల జిల్లాలో నేర నియంత్రణే లక్ష్యంగా విజువల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా వేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం జరిగే నేరాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. నేరాలు చేస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.