News February 27, 2026
తీవ్ర విషాదం.. రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో రింకూ హుటాహుటిన సొంతూరుకు బయలుదేరారు. కొన్ని రోజులుగా ఖచంద్ర లివర్ క్యాన్సర్(ఫోర్త్ స్టేజ్)తో బాధపడుతున్నారు. తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలిసి 3 రోజుల కిందటే రింకూ ఆసుపత్రికి వెళ్లారు. నిన్న మ్యాచ్ సమయానికి మళ్లీ తిరిగి జట్టుతో చేరినా ప్లేయింగ్-11లో చోటు దక్కలేదు.
Similar News
News April 15, 2026
ముగింపు దశలో యుద్ధం.. కానీ: ట్రంప్

ఇరాన్‌తో రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్‌తో యుద్ధం ముగింపు దశకు చాలా దగ్గరగా ఉందన్నారు. అయితే అమెరికా పని ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. ‘వారు ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడే మా బలగాలను ఉపసంహరించుకుంటే ఆ దేశాన్ని తిరిగి నిర్మించుకోవడానికి 20 ఏళ్లు పడుతుంది’ అని పేర్కొన్నారు.
News April 15, 2026
మరింత పెరగనున్న వాహనాల ధరలు?

నిర్వహణ ఖర్చులు పెరిగాయంటూ ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలు పెంచుతున్నాయి. యుద్ధం మరింత కాలం కొనసాగితే ఉత్పత్తి వ్యయం పరిమితికి మించి పెరిగి రేట్లు మరింత పెంచాల్సి రావొచ్చని భారత వాహన తయారీదారుల సమాఖ్య(సియామ్) అధ్యక్షుడు శైలేశ్ చంద్ర తెలిపారు. కమోడిటీ ధరలు ఏమేర పెరుగుతాయనేది 4-5 వారాల్లో స్పష్టత రావొచ్చన్నారు. ఆ తర్వాతే వాహనాల రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని వెల్లడించారు.
News April 15, 2026
US-ఇరాన్ చర్చలపై వాన్స్ కీలక వ్యాఖ్యలు

అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా నమ్మకం లేకపోవడమే పెద్ద అడ్డంకి అని JD వాన్స్ అభిప్రాయపడ్డారు. దాన్ని తొలగించడం అంత సులభం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సీజ్‌ఫైర్‌ను పూర్తిస్థాయి శాంతి ఒప్పందంగా మార్చడం పెద్ద ఛాలెంజ్ అన్నారు. ఏళ్ల తరబడిగా ఉన్న విభేదాలు ఒక్క రాత్రిలో పరిష్కారం కావని స్పష్టం చేశారు. మరోసారి ఇరుపక్షాలు చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో వాన్స్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


