News March 12, 2025
తుంగతుర్తి పోలీస్ స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం

తుంగతుర్తి PSలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎస్సై క్రాంతి కుమార్ వివరాలిలా.. రావులపల్లికి చెందిన నాగయ్య అడ్డగూడూరు మం. లక్ష్మీకాల్లపల్లికి చెందిన యువతితో పెళ్లైంది. గొడవల కారణంగా అతని భార్య పుట్టింటికి వెళ్లింది. నాగయ్య అత్తావారింటికి వెళ్లడంతో ఘర్షణ జరగ్గా, వారు PSలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో PSకు చేరుకున్న నాగయ్య పెట్రోల్ పోసుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అతణ్ని ఆస్పత్రికి తరలించారు.
Similar News
News March 23, 2025
నేడు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సన్నాహక సమావేశం

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సన్నాహాక సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరంగర్‌లో ఉంటుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అన్నారు. ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరవుతున్నారని చెప్పారు. కావున జిల్లా ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, కాంగ్రెస్ అన్ని విభాగాల ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.
News March 23, 2025
పెండింగ్ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

అంగన్వాడీ కేంద్రాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. కలెక్టరేట్‌లో అంగన్వాడీ కేంద్రాల భవనాలలో తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, మరమ్మతు పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలలో ఇప్పటి వరకూ చేపట్టిన అభివృద్ధి, ఇతర వసతుల కల్పనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.
News March 23, 2025
మెదక్: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సునీత లక్ష్మారెడ్డి కాలనీలో నివాసం ఉండే సిరివెన్నెల అనే వివాహిత ఈనెల 20న హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల వద్ద ఎక్కడ వెతికిన ఆచూకీ లభించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.