News March 18, 2025
తుంగతుర్తి: ప్రజల పక్షాన పోరాడేది BRS మాత్రమే: గాదరి

ప్రభుత్వం చేతగాని, చేవలేని పని తనాన్ని ఎండగడుతూ ప్రజల పక్షాన కొట్లాడే ప్రధాన పాత్ర బీఆర్ఎస్ పోషిస్తోందని అందులో భాగంగా ఈనెల 20న నిర్వహించే పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశాన్ని, ఏప్రిల్ 27న భారీ బహిరంగసభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Similar News
News November 27, 2025
‘ఆసుపత్రులకు శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరు చేశాం’

జిల్లాలో ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిచేందుకు ఆస్పత్రులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు పురోగతిపై సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ వైద్యసంస్థల నమోదు, నిబంధనల అమలు, సేవల నాణ్యత, ప్రజారోగ్య పరిరక్షణ అంశాలపై విస్తృతంగా చర్చ జరిపి 46 ప్రైవేట్ ఆసుపత్రులకు శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరు చేశామన్నారు.
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<
News November 27, 2025
వరంగల్: ఏడాది గడిచినా వేతనాలు అందని దుస్థితి!

ఇంటింటి కుటుంబ సర్వే పూర్తై ఏడాది గడిచినా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు వేతనాలు అందక నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో 1.79 లక్షల కుటుంబాలపై 1200 మంది ఎన్యుమరేటర్లు, 119 మంది సూపర్వైజర్లు పనిచేశారు. ఎన్యుమరేటర్లకు రూ.10వేలు, సూపర్వైజర్లకు రూ.12వేలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రతి దరఖాస్తుకు రూ.30 చొప్పున ఇవ్వాలని నిర్ణయించినా చెల్లింపులు నిలిచిపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


