News March 4, 2025

తుంగతుర్తి: 18 మందికి షోకాజ్ నోటీసులు

image

తుంగతుర్తిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన 18 మందికి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సోమవారం ఎమ్మెల్యే మందుల సామేలు గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ప్రిన్సిపల్‌తో పాటు 15 మంది టీచర్లకు, ఇద్దరు వంట మనుషులు విధుల్లో లేకపోవడంతో వారిపై చర్యలు తీసుకున్నారు.

Similar News

News November 15, 2025

గుంటూరు మిర్చీ యార్డులో 40,026 టిక్కీలు అమ్మకం

image

గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం 34,160 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 40,026 అమ్మకం జరిగాయని ఇంకా యార్డు ఆవరణలో 7,698 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు విధాలుగా నమోదయ్యాయన్నారు.

News November 15, 2025

వరంగల్: ఇంటికి తాళం వేయాలంటే భయం..!

image

ఉమ్మడి WGL జిల్లాలో నెల రోజులుగా వరుస చోరీలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠాలు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి బంగారం, వెండి, నగదు దోచుకెళ్తున్నాయి. WGL-KZP రైల్వే మార్గం ఉండటం వీరికి పెద్ద అనుకూలంగా మారింది. BHPL లక్ష్మీనగర్, HNK రాంనగర్, MHBD ఉప్పరపల్లి, <<18289396>>WGL జిల్లా పర్వతగిరి<<>> మండలాల్లో వరుస చోరీలు చోటుచేసుకోగా, ప్రజలు ఇంటికి తాళం వేయడానికే భయపడుతున్నారు.

News November 15, 2025

ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో కార్తీక మాసం శనివారం ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు. ఆలయ అర్చకులు తదితరులున్నారు.