News August 18, 2024

తుంగభద్రలో ‘స్టాప్‌లాగ్‌’ సక్సెస్‌.. రియల్‌ హీరో కన్నయ్య!

image

తుంగభద్ర డ్యాం 19వ గేటు స్థానంలో స్టాప్‌లాగ్‌ ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించిన కన్నయ్య నాయుడుపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 80 ఏళ్ల వయస్సులోనూ ఎండను లెక్క చేయకుండా స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్లను అమర్చడంలో కీలక పాత్ర పోషించారు. జలాశయంలో 105 TMCల నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించగలిగారు. చిత్తూరు జిల్లాకు చెందిన కన్నయ్యకు 260 ప్రాజెక్టులకు క్రస్ట్‌ గేట్లను డిజైన్‌ చేసి అమర్చిన అనుభవం ఉంది.

Similar News

News September 13, 2024

అనంత: నూరుల్లా దారుణ హత్యకు వివాహేతర సంబంధమే కారణం

image

తాడిపత్రిలో గురువారం రాత్రి నూరుల్లా(34) అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వివరాలను సీఐ సాయిప్రసాద్ వెళ్లడించారు. ‘నూరుల్లా ఆర్జాస్ ఉక్కు పరిశ్రమలో ఉద్యోగం చేసేవారు. కొన్నేళ్ల నుంచి చిన్న బజార్‌కు చెందిన మహిళతో సన్నిహితంగా ఉన్నారు. నిన్న రాత్రి విధులు ముగించుకొని సదరు మహిళ ఇంటి వద్దకు వెళ్లడం ఆమె బంధువులు చూశారు. ఆవేశంతో బండరాళ్లతో కొట్టి హత్య చేశారు’ అని తెలిపారు.

News September 13, 2024

శ్రీ సత్యసాయి: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఒకరు దుర్మరణం

image

శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి వద్ద అనంతపురం-చెన్నై జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం వైపు నుంచి కదిరి వైపునకు బైక్‌పై వెళ్తుండగా పక్కనున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 13, 2024

ఈ పంట నమోదులో అధికారులకు నిర్లక్ష్యం తగదు: కలెక్టర్

image

అనంత: ఖరీఫ్లో చేపడుతున్న ఈ పంట నమోదులో వ్యవసాయ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంతో వ్యవహరించి రాదనీ, ఈ నెల 15 నాటికీ వంద శాతం పంట నమోదు పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ నిర్దేశించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పంట నమోదులో భాగంగా బ్రహ్మసముద్రం, నార్పల, హీరేహాళ్ మండలాలు వెనుకబడ్డాయని, కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వజ్రకరూరులో మాత్రమే 100 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు.