News August 20, 2024
తుంగభద్ర డ్యాం.. ఇన్ ఫ్లో 31,435 క్యూసెక్కులు

తుంగభద్ర డ్యాం నుంచి నదికి నీటి విడుదల ఆగిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 31,435 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం మొత్తం నీటి సామర్థ్యం 105.33 టీఎంసీలుకాగా ప్రస్తుతం 76.780 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మొత్తం అవుట్ఫ్లో 10,089 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 7, 2025
కర్నూలు: ‘స్క్రబ్ టైఫస్.. వ్యాధి కాదు’

స్క్రబ్ టైఫస్ వ్యాధి కాదని, మనిషి నుంచి మనిషికి వ్యాపించదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై వైద్య బృందంతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 44 పాజిటివ్ కేసులు వచ్చాయని, అందరికీ చికిత్స అందించామని, 39 మంది రోగులను డిశ్చార్జ్ చేశామని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు వివరించారు.
News December 7, 2025
ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది: డీఈవో

పదో తరగతి ఫలితాల కోసం ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని డీఈవో శామ్యూల్ పాల్ అన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఉన్నత పాఠశాలలో స్టడీ అవర్స్ తరగతులను శనివారం ఆయన పరిశీలించారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా పాఠ్యాంశాలపై అవగాహన కల్పించి, పాఠాలు పూర్తిగా నేర్పే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన తెలిపారు. ప్రతీ పాఠశాలలో షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.
News December 7, 2025
ట్రేడర్లు ఎంఎస్పీ కన్నా తక్కువకు కొనరాదు: కలెక్టర్

రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా మొక్కజొన్నను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటా రూ.2,400 తగ్గకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్ డా. ఏ.సిరి ట్రేడర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో ట్రేడర్లతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తూకాలలో లోపాలు, మోసాలు జరగకుండా పరిశీలనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రవాణా ఛార్జీలు అధికంగా ఉండటం వల్ల కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చర్యలు చేపట్టామన్నారు.


