News August 20, 2024
తుంగభద్ర డ్యాం.. ఇన్ ఫ్లో 31,435 క్యూసెక్కులు
తుంగభద్ర డ్యాం నుంచి నదికి నీటి విడుదల ఆగిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 31,435 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం మొత్తం నీటి సామర్థ్యం 105.33 టీఎంసీలుకాగా ప్రస్తుతం 76.780 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మొత్తం అవుట్‌ఫ్లో 10,089 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News September 14, 2024
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: కర్నూలు కలెక్టర్
జాబ్ మేళాను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకొని, భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఉద్యోగ మేళా పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 20వ తేదీన కర్నూల్‌లోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News September 13, 2024
కర్నూలు జిల్లాలో రైలు మార్గం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా?
కర్నూలు జిల్లాలో మొట్టమొదటి రైలు మార్గం 1870లో ప్రారంభమైంది. ముంబై, చెన్నైలను కలుపుతూ ఏర్పడిన రైలు మార్గం ఆదోని, ఆలూరు ప్రాంతాల మీదుగా 97 కి.మీ మేర ఉంటుంది. దీంతో ఎగుమతులు, దిగుమతులకు ఆదోని కేంద్రంగా మారింది. అందుకే ఈ ప్రాంతానికి రెండో బాంబేగా పేరు వచ్చిందట. 1909లో కర్నూలు-డోన్, 1930లో కర్నూల్- హైదరాబాద్‌కు రాకపోకలు ప్రారంభమయ్యాయి. 1921 SEP 29న జాతిపిత మహాత్మా గాంధీ రైలులోనే కర్నూలుకు వచ్చారు.
News September 13, 2024
మంత్రి బీసీ ఆధ్వర్యంలో 18న మెగా జాబ్ మేళా
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 18న బనగానపల్లె డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి సతీమణి బీసీ ఇందిరారెడ్డి వెల్లడించారు. ఈ జాబ్ మేళాకు 9 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. 1,191 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసిన వారు అర్హులన్నారు.