News August 13, 2024
తుంగభద్ర డ్యాం.. నీటి వృథా కాకుండా స్టాప్‌లాగ్

తుంగభద్ర డ్యాంలో నీరు పూర్తిగా వృథా కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 19వ గేటు స్థానంలో స్టాప్‌లాగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. హొసపేటెలో స్టాప్‌లాగ్ గేటును కార్మికులు సిద్ధం చేస్తున్నారు. రెండు రోజుల్లో తయారీ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుతం జలాశయంలో 97 టీఎంసీల నీటినిల్వ ఉంది. గేటు కొట్టుకుపోయిన తర్వాతి నుంచి నిన్న రాత్రి 9 గంటల వరకు 8 టీఎంసీల నీళ్లు ఖాళీ అయ్యాయి.
Similar News
News December 7, 2025
ప్రశాంతంగా ఎన్ఎంఎమ్ఎస్ పరీక్షలు: డీఈఓ

భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. కర్నూలులోని బి.క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును డీఈవో శామ్యూల్ పాల్ పరిశీలించారు. 4,124 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 3,960 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 164 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు.
News December 7, 2025
నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలి: ఎస్పీ

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు చేపట్టారు.
News December 7, 2025
నంద్యాల: పెళ్లి అయిన నెలకే యువకుడి సూసైడ్

అనంత(D) యాడికి మండలం నగరూరుకు చెందిన శరత్‌కుమార్(25) కొలిమిగుండ్ల జగనన్న కాలనీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి తన మిత్రుడు హరీశ్ ఇంటికి వచ్చిన శరత్.. శనివారం హరీశ్ డ్యూటీకి వెళ్లిన తర్వాత విషగుళికలు మింగాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతన్ని అనంతపురం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. శరత్ గత నెలలో బళ్లారిలో వివాహం చేసుకుని, బెంగళూరులో ప్రైవేట్ జాబ్‌లో చేరాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.


