News November 28, 2024
తుంగభద్ర తీరంలో మొసలి కలకలం
తుంగభద్ర నది తీరంలో మొసలి కలకలం లేపింది. కౌతాళం మండలం గుడి కంబాలి సమీపంలో గురువారం తుంగభద్ర నది ఒడ్డున పెద్ద మొసలి పొలాల వైపు రావడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఏడాదిలో తుంగభద్ర నది తీరంలోని అనేక గ్రామాల పంట పొలాలలో మొసళ్లు కంటబడుతున్నాయి. నది చాగీ, కుమ్మలనూరు, మురళి గ్రామాల సమీపంలో 2 నెలల నుంచి మొసళ్లు సంచరిస్తూనే ఉన్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
Similar News
News December 8, 2024
వెల్దుర్తిలో స్నేహితుల ఆర్థిక సాయం అందజేత
వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988 – 89 సంవత్సరంలో పదవ తరగతి విద్యను అభ్యసించిన మిత్రులందరికీ కొన్ని రోజుల క్రితం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో తోటి మిత్రురాలు తంబల రాజేశ్వరికి రెండు కిడ్నీలు చెడిపోయి అనారోగ్యంతో ఉన్న విషయాన్ని తోటి స్నేహితులు తెలుసుకున్నారు. ఈ మేరకు వారు రూ.20 వేల నగదును సేకరించి ఆదివారం ఆమెకు అందించారు. అనంతరం ఆమె త్వరగా కోలుకోవాలని వారు ప్రార్థించారు.
News December 8, 2024
బేతంచర్లలో ఇరు వర్గాల హిజ్రాల మధ్య ఘర్షణ
బేతంచెర్లలోని కొత్త బస్టాండు సమీపంలో ఆదివారం హిజ్రా వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నంద్యాలకు చెందిన హిజ్రాల వర్గం బేతంచర్లకు వచ్చి డబ్బువసూలు చేయకూడదని స్థానికులు వాగ్వాదానికి దిగారు. స్థానికుల సమాచారంతో బేతంచర్ల ఎస్సై రమేశ్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో ఘర్షణ సద్దుమణిగింది.
News December 8, 2024
బనగానపల్లెలో టీచర్‌పై కేసు
ఓ ప్రైవేటు పాఠశాల టీచర్‌ను తల్లిదండ్రులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన బనగానపల్లెలో శనివారం జరిగింది. మ్యాథ్స్ టీచర్ ధృవకుమార్ విద్యార్థులకు మార్కులు ఎక్కువ వేస్తానని ఓ విద్యార్థిని వద్ద డబ్బు వసూలు చేసినట్లు యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు ఎస్సై తెలిపారు. అయితే దాంతో పాటు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిసి పేరెంట్స్ చితకబాది పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.