News September 2, 2024

తుంపల్లి వాగును పరిశీలించిన కలెక్టర్

image

ఆసిఫాబాద్ మండలంలోని తుంపల్లి వాగును సోమవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సందర్శించారు. అధికారులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ..వరద ప్రభావిత, లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలకు ఎవరు వెళ్లవద్దన్నారు. సమస్యలు ఉంటే కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Similar News

News December 2, 2025

ADB: విత్తన బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలి

image

ముసాయిదా విత్తన బిల్లు–2025 రూపకల్పనలో ప్రతి వర్గ అభిప్రాయం కీలకమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో రైతులు, విత్తన డీలర్లు, కంపెనీలు, రైతు ఉత్పాదక సంఘాలు, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్న ప్రత్యేక సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. కొత్త విత్తన బిల్లు రైతు ప్రయోజనాలను కాపాడేలా, నాణ్యమైన విత్తనాల సరఫరాపై కట్టుదిట్టమైన నియంత్రణలు ఉండేలా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

News December 2, 2025

ఆదిలాబాద్: పెంపుడు శునకానికి పురుడు

image

ఆదిలాబాద్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామంలో ఏలేటి నర్సారెడ్డి పటేల్, నాగమ్మ దంపతులు ఇంట్లో ఓ కుక్కను పెంచుకుంటున్నారు. అది నవంబర్ 12న ప్రసవించింది. నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఇవాల్టికి 21వ రోజు కావడంతో ఆ శునకానికి పురుడు చేసి.. కుక్క పిల్లలకు నామాకారనోత్సవం చేశారు. అనంతరం శునకానికి నైవేద్యం సమర్పించారు.

News December 1, 2025

నార్నూర్: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

image

నార్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామ వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని జాదవ్ నరేష్ (18) ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై గణపతి తెలిపారు. జైనూర్ మండలం అందుగూడకు చెందిన సునీత, అన్నాజీ దంపతుల కుమారుడు నరేష్ నాలుగేళ్లుగా పాలేరుగా పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో వెళ్లి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.