News May 25, 2024
తుగ్గలిలో రైతుకు దొరికిన రూ.20 లక్షల వజ్రం

కర్నూలు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో వజ్రాల వేట మెుదలైంది. తుగ్గలి మండలం మదనంతపురం గ్రామంలో ఓ రైతుకు వజ్రం దొరికింది. దీనిని పెరవలికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి రూ.20 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. తుగ్గలి మండలంలో వజ్రాల కోసం ఇతర రాష్రాల నుంచి వచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు.
Similar News
News February 19, 2025
‘నక్షా’తో భూములకు శాశ్వత రక్ష: పాణ్యం ఎమ్మెల్యే

ప్రభుత్వ, ప్రైవేటు భూములకు కేంద్ర ప్రభుత్వ నేషనల్ జియో స్పాటియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్ (నక్షా) కార్యక్రమం శాశ్వత రక్షణ ఇస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్రాల సమన్వయకర్త బీసీ పరిదా అన్నారు. ఈ కార్యక్రమం కోసం కర్నూలు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడం హర్షనీయమని ఎమ్మెల్యే తెలిపారు.
News February 18, 2025
రాయలసీమ యూనివర్సిటీ వీసీగా వెంకట బసవరావు

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా ప్రొఫెసర్ డాక్టర్ వెంకట బసవరావు నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటీఫికేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన త్వరలోనే వీసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. కాగా వెంకట బసవరావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా, పలు విభాగాలకు HODగా విధులు నిర్వహించారు.
News February 18, 2025
గుండెపోటుతో దేవనకొండ హెచ్ఎం మృతి

దేవనకొండ మండల కేంద్రంలోని ఎంపీపీ స్కూల్లో (మెయిన్) విధులు నిర్వహిస్తున్న హెచ్ఎం పద్మావతి సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. దేవనకొండలో బుధవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ఆమె భర్త రఘునాథ్ తెలిపారు. ఈ ఘటనతో దేవనకొండలో విషాదఛాయలు అమలుకున్నాయి. ఉపాధ్యాయులు శ్రద్ధాంజలి ఘటించారు.