News June 5, 2024
తుగ్గలి నాగేంద్రకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి: శంకర్
తుగ్గలి నాగేంద్రకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని లక్ష్మికుమ్మరి శాలివాహన కోఆపరేటరేటివ్ సొసైటీ ట్రెజరర్ కుమ్మరి శంకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో కుమ్మరి శాలివాహన సంఘాన్ని గుర్తించి ఐలాపురం వెంకయ్యకు ఎమ్మెల్సీ ఇచ్చారని, 2019లో వైఎస్ జగన్ శాలివాహన సంఘాన్ని గుర్తించి ఎం.పురుషోత్తంకు ఫెడరేషన్ ఛైర్మన్ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు నాగేంద్రకు ఎమ్మెల్సీ ఇవ్వాలన్నారు.
Similar News
News November 5, 2024
టెట్‌లో నంద్యాల జిల్లా విద్యార్థుల సత్తా
టెట్ ఫలితాల్లో నంద్యాల జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. 150/150 మార్కులతో ఇద్దరు విద్యార్థులు స్టేట్ ఫస్ట్ నిలిచారు. అవుకు మండలం నిచ్చెనమెట్ల గ్రామానికి చెందిన తలారి క్రాంతికుమార్, కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లెకు గ్రామానికి వడ్ల మంజుల అనే ఇరువురూ 150/150 మార్కులు సాధించారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన ఇరువురూ స్టేట్ టాపర్లుగా నిలవడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 5, 2024
కర్నూలు: 18 వరకు టెన్త్ ఫీజు చెల్లింపు గడువు: డీఈవో
ఈనెల 18వ తేదీ వరకు టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుంతో 25వ తేదీ వరకు, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబర్ 3వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుంతో డిసెంబర్ 10వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 4, 2024
ఈనెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీశైలం పర్యటన..!
ఈనెల 9న రాష్ట్ర సీఎం శ్రీశైలం పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున సంబంధిత ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. విజయవాడ- శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పర్యాటక, రెవెన్యూ, పంచాయతీరాజ్, దేవాదాయ, జలవనరులు, మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు.