News September 15, 2024

తుగ్గలి: వజ్రం దొరికింది

image

ఓ రైతుకు వజ్రం దొరికిన ఘటన తుగ్గలి మండలంలో జరిగింది. మండలంలోని సూర్యతండాకు చెందిన ఓ రైతు పొలం పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయనకు 8 క్యారెట్ల బరువైన వజ్రం దొరికింది. దానిని జొన్నగిరికి చెందిన ఓ వ్యాపారి రూ.10 లక్షలకు కొనేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

Similar News

News October 5, 2024

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు నందికొట్కూరు విద్యార్థిని ఎంపిక

image

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు నందికొట్కూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని హబ్షిబా ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ షేక్షావలి, ఫిజికల్ డైరెక్టర్ రియాజుద్దీన్ శుక్రవారం తెలిపారు. కర్నూలు స్టేడియంలో సెప్టెంబర్ 26న జరిగిన అండర్-19 స్కూల్ గేమ్స్ ఉమ్మడి కర్నూలు జిల్లా కబడ్డీ పోటీలలో హబ్షిబా ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు.

News October 5, 2024

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థిని ఎంపిక

image

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు నందికొట్కూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని హబ్షిబా ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ షేక్షావలి, ఫిజికల్ డైరెక్టర్ రియాజుద్దీన్ శుక్రవారం తెలిపారు. కర్నూలు స్టేడియంలో సెప్టెంబర్ 26న జరిగిన అండర్-19 స్కూల్ గేమ్స్ ఉమ్మడి కర్నూలు జిల్లా కబడ్డీ పోటీలలో హబ్షిబా ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎన్నికైనట్లు పేర్కొన్నారు.

News October 5, 2024

కృష్ణగిరిలో 48.2 మి.మీ వర్షం

image

కర్నూలు జిల్లాలో వర్షం దంచికొట్టింది. కృష్ణగిరిలో అత్యధికంగా 48.2 మి.మీ వర్షం కురిసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 25 మండలాల్లో వాన పడింది. జిల్లాలో సగటున 12.6 మి.మీ వర్షం నమోదైంది. అత్యల్పంగా ఎమ్మిగనూరులో 2.4, చిప్పగిరి 2.0, హాలహర్విలో 1.0 మి.మీ వర్షం కురిసింది. భారీ వర్షంతో ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వివిధ పంట దిగుబడులు తడిచిపోయాయి. నేడు మార్కెట్‌ యార్డుకు సెలవు ప్రకటించారు.