News February 16, 2025

తునిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి 

image

తుని పట్టణంలోని డీ మార్ట్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఐచర్ వ్యానును బైకు వెనుకనుంచి ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తలకు బలమైన గాయం తగిలింది. క్షతగాత్రుడిని తుని గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారని తుని పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపారు.

Similar News

News April 16, 2026

నిర్మల్: పాలీసెట్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

image

మే 13వ తేదీన నిర్వహించనున్న పాలీసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. పదో తరగతి పరీక్ష రాసిన, ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిప్లమో కోర్సుకు ఈ నెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తామన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల సహాయార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News April 16, 2026

కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

image

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

News April 16, 2026

‘వ్యవసాయ భూములను నివాస ప్రాంతాల నుంచి తొలగించాలి’

image

వ్యవసాయ భూములను నివాస ప్రాంతాల నుంచి తొలగించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి అనామిలి కమిటీ సమావేశం గురువారం బాపట్ల కలెక్టరేట్‌లో నిర్వహించారు. నివాస ప్రాంతాల ధరల మాదిరిగానే వ్యవసాయ భూములకు ధరలను నిర్ణయించడంపై వచ్చిన అర్జీలను కలెక్టర్ పరిశీలించారు. రైతులకు మేలు చేయడం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మార్కెట్ వాల్యూ జిల్లా రిజిస్టర్ కమిటీ కన్వీనర్ ప్రసాద్ పాల్గొన్నారు.