News February 24, 2025

తునిలో 17 మంది వైసీపీ కౌన్సిల్ సభ్యులు రాజీనామా?

image

తుని పురపాలక వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా నేపథ్యంలో నగరంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఊహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 17 మంది వైసీపీ కౌన్సిల్ సభ్యులు రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కౌన్సిలర్లతో ఆదివారం సమావేశమయ్యారు. కౌన్సిల్ సభ్యులు రాజీనామా చేస్తారా అనే విషయం నేడు ప్రెస్‌మీట్‌లో తేలనుంది.

Similar News

News March 23, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదిక వేళలు ఇవే: కలెక్టర్

image

నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎండలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమానికి వచ్చే ప్రజలెవ్వరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఉదయం 9.30 గంటలకే అర్జీల స్వీకరణ చేపడతామన్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.

News March 23, 2025

విశాఖ రానున్న మంత్రి కందుల దుర్గేష్

image

ఏపీ రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం విశాఖ రానున్నారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 10 గంటలకు రుషికొండ బీచ్ ప్రాంతానికి వస్తారు. అనంతరం ఋషికొండ దగ్గర బ్లూ ఫ్లాగ్‌ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి విశాఖ సర్క్యూట్ హౌస్‌కి వెళ్లి ముఖ్య నాయకులతో సమావేశమై సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి గన్నవరం వెళ్లనున్నారు.

News March 23, 2025

రేషన్ కార్డుదారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్

image

TG: రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ APR నుంచి 6KGల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 84% మందికి ఈ బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. ఈ నెల 30న హుజూర్‌నగర్‌లో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు వారానికోసారి సమీక్ష చేస్తున్నామన్నారు.

error: Content is protected !!