News November 17, 2024
తుని – అన్నవరం మధ్య ఎయిర్ పోర్ట్

రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, అందులో తుని- అన్నవరం ఒకటి. ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం ఆ ప్రాంతాల మధ్య 787 ఎకరాలను గుర్తించింది. పారిశ్రామిక , వ్యాపార , పర్యాటకం ఇలా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ప్రాంతం జిల్లాలోని అందరికీ అనుకూలంగా ఉంటుందని భావించినట్లు తెలుస్తోంది.
Similar News
News December 6, 2025
10 లోపు సంతకాల సేకరణ పూర్తి చేయాలి: చెల్లుబోయిన

కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి ఈ నెల 10వ తేదీన జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేయాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ఆదేశించారు. అనంతరం 13వ తేదీన వాటిని కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపనున్నట్లు ఆయన తెలిపారు. బొమ్మూరు పార్టీ కార్యాలయం నుంచి జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తి అధ్యక్షతన శనివారం నిర్వహించిన గూగుల్ మీట్ సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు.
News December 6, 2025
8న పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

డిసెంబర్ 8న రాజమండ్రి కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల, గ్రామ సచివాలయ స్థాయిల్లో PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రజల అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ప్రధాన లక్ష్యమన్నారు. అర్జీదారులు తమ వినతిపత్రాలను Meekosam.ap.gov.in ద్వారా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చని ఆమె చెప్పారు.
News December 6, 2025
హోంగార్డుల సేవలు కీలకం: ఎస్పీ

63వ హోంగార్డ్స్ ఆవిర్భావ వేడుకలను శనివారం రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోంగార్డులు నిస్వార్థ సేవలు అందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సేవా దృక్పథంతో విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ కొనియాడారు. పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు కీలకమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.


