News November 17, 2024
తుని – అన్నవరం మధ్య ఎయిర్ పోర్ట్
రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, అందులో తుని- అన్నవరం ఒకటి. ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం ఆ ప్రాంతాల మధ్య 787 ఎకరాలను గుర్తించింది. పారిశ్రామిక , వ్యాపార , పర్యాటకం ఇలా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ప్రాంతం జిల్లాలోని అందరికీ అనుకూలంగా ఉంటుందని భావించినట్లు తెలుస్తోంది.
Similar News
News December 13, 2024
తూ.గో: ఆకట్టుకుంటున్న పసుపు రంగు సీతాఫలాలు
కడియం నర్సరీలలో పసుపు రంగు సీతాఫలాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కడియంకు చెందిన నర్సరీ రైతు దుర్గారావు మూడేళ్ల క్రిందట థాయిలాండ్ నుంచి మొక్కను తెచ్చి ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా పెంచి పోషించారు. రైతు దుర్గారావు మాట్లాడుతూ..ప్రస్తుతం మొక్క ఇప్పటికి పెద్దదై పూత పూసిందని సంవత్సరానికి రెండుసార్లు దిగుబడిని ఇస్తుందని, లోపల గుజ్జు ఎంతో రుచిగా ఉంటుందన్నారు. దీనితో పండ్ల ప్రేమికులు సందర్శిస్తున్నారు.
News December 13, 2024
రాజమండ్రి: హోంగార్డుతో అసభ్య ప్రవర్తన.. హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
బొమ్మూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా హోంగార్డుతో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిని గురువారం సస్పెండ్ చేశారు. SP నరసింహ కిషోర్ ఈ మేరకు అతనిపై చర్యలు తీసుకున్నారు. మద్యం మత్తులో హెచ్‌సీ విధి నిర్వహణలో ఉన్న మహిళా హోంగార్డుతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె భర్త ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
News December 13, 2024
రాజమండ్రి: హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని 2020లో జరిగిన ఓ హత్య కేసులో కోర్టు ముద్దాయికి జీవిత ఖైదు విధించింది. రాజమండ్రి రూరల్ కొంతమూరుకు చెందిన కనకదుర్గను హత్య చేసిన కేసులో నరసింహరాజును ముద్దాయిగా కోర్టు నిర్ధారించింది. సాక్షుల విచారణ అనంతరం జడ్జి విజయ్ గౌతమ్ ముద్దాయిపై నేరం రుజువు కావటంతో జీవిత ఖైదుతోపాటు, రూ.2 వేలు జరిమానా విధించినట్లు కోర్టు తీర్పు వెల్లడించిందని పోలీసులు తెలిపారు.