News March 7, 2025
తుని : ఇంటర్ విద్యార్థి సూసైడ్

పరీక్షల ఒత్తిడితో పాటు అనారోగ్యంతో గురువారం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు. తునిలో చదువుతున్న అనకాపల్లికి చెందిన జోగా సృజన జయప్రియ (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసి ఇంటికి వచ్చింది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘నా చావుకు నా అనారోగ్యమే కారణం’ అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News February 23, 2026
తిరుపతి: లడ్డూ వివాదం.. నేడు ఏం జరగనుందో.?

తిరుమల కల్తీ నెయ్యి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించగా.. దీనిపై మాజీ MP సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసుపై ఇవాళ వాదనలు జరగనున్నాయి. ఇది వరకే ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు CBI సిట్ ఏర్పాటైన విషయం తెలిసిందే. మళ్లీ AP ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడంతో సుప్రీం కోర్ట్‌లో ఏం జరగనుందో అన్న చర్చ నడుస్తోంది.
News February 23, 2026
చెర్వుగట్టు విరాళాల్లో భారీ గోల్‌మాల్

నల్గొండ జిల్లా చెర్వుగట్టు ఆలయ అన్నదాన విరాళాల్లో భారీ అవకతవకలు వెలుగుచూశాయి. గతేడాది DECలో ఓ భక్తుడు అందజేసిన రూ.5 వేలు విరాళానికి గాను సిబ్బంది కేవలం రూ.1,000 మాత్రమే రికార్డుల్లో చూపినట్లు భక్తులు ఆరోపించారు. అధికారుల మౌనంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేయాలని, పూర్తిస్థాయి విచారణ జరిపి ఆలయ పవిత్రతను కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
News February 23, 2026
భద్రాద్రి: రూ.80 కోట్లతో నవోదయ విద్యాలయం

అశ్వాపురం(M) భీముని గుండం కొత్తూరులో జవహర్ నవోదయ విద్యాలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. మొండికుంట పరిధిలోని 997 సర్వే నంబర్‌లోని 33 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించింది. సుమారు రూ.80 కోట్లతో నిర్మాణ బాధ్యతను NBCCకి అప్పగించారు. ఇటీవల అధికారులు క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించారు. దీని ద్వారా జిల్లా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి వసతులతో కూడిన విద్య అందుబాటులోకి రానుంది.


