News March 7, 2025

తుని : ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

పరీక్షల ఒత్తిడితో పాటు అనారోగ్యంతో గురువారం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు. తునిలో చదువుతున్న అనకాపల్లికి చెందిన జోగా సృజన జయప్రియ (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసి ఇంటికి వచ్చింది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘నా చావుకు నా అనారోగ్యమే కారణం’ అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

Similar News

News March 16, 2025

HYD: ఓయూ క్యాంపస్‌లో ఇవి బంద్!

image

ఓయూలో ఆందోళనలు, ప్రదర్శనలపై నిషేధం విధిస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు మూకుమ్మడిగా మండిపడుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపడం ప్రజాస్వామ్య హక్కు అని, దానిని అణిచివేయాలని చూస్తే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.

News March 15, 2025

ముస్లింలకే 4% రిజర్వేషన్లు అని ఎవరు చెప్పారు?: DK శివకుమార్

image

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4% రిజర్వేషన్లు ముస్లింలకే కేటాయించిందని కర్ణాటక సర్కారును ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వేళ ఆ రాష్ట్ర Dy.CM డీకే శివ కుమార్ స్పందించారు. ‘కేవలం ముస్లింలకు 4% రిజర్వేషన్లు అని ఎవరు చెప్పారు. వెనకబడిన తరగతుల వారి కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మైనార్టీలు అంటే ముస్లింలే కాదు. అందులో క్రిస్టియన్లు, జైనులు, పార్సీలు, సిక్కులు, మొదలైన వారు ఉంటారు’ అని క్లారిటీ ఇచ్చారు.

News March 15, 2025

బీటెక్ విద్యార్థి అదృశ్యం

image

నల్లమాడ (మం) ఎద్దులవాండ్ల పల్లికి చెందిన రామ్మోహన్ రెడ్డి కుమారుడు బీటెక్ విద్యార్థి లక్ష్మీకాంత్ రెడ్డి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తన కుమారుడు అనంతపురం పీవీకేకే కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడని తెలిపారు. ఈనెల 7న బైక్‌పై బెంగళూరుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి, అప్పటి నుంచి కనిపించకుండా పోయాడని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

error: Content is protected !!