News February 27, 2026

తుని: ఐదేళ్లు.. ముగ్గురు మహిళలు

image

తుని మున్సిపాలిటీ ఐదేళ్ల పాలనలో ముగ్గురు ఛైర్ పర్సన్లు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఛైర్ పర్సన్‌గా ఉన్న నార్ల భువన సుందరి పదవీకాలం మార్చి 17తో ముగియనుంది. 2021లో YCP నుంచి ఏలూరి సుధారాణి బాధ్యతలు చేపట్టగా, 2025లో రాజీనామా చేశారు. అనంతరం కుచ్చర్లపాటి రూపాదేవి ఆ బాధ్యతలు చేపట్టారు. తదుపరి భువన సుందరి చైర్ పర్సన్‌గా ఎంపికై పదవీకాలాన్ని పూర్తి చేస్తున్నారు.

Similar News

News April 18, 2026

కొత్త SEకి కలెక్టర్ సూచన

image

వరంగల్ విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆనందం శుక్రవారం కలెక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన విద్యుత్ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. జూన్ 2న భవనాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నందున పనుల్లో పురోగతి సాధించాలని ఆదేశించారు. ఈ భేటీలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు.

News April 18, 2026

కామారెడ్డి: అప్పుల బాధతో మహిళ రైతు ఆత్మహత్య

image

కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులో శుక్రవారం సాయంత్రం ఓ మహిళ రైతు తన పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు దోమకొండ మండలం చింతమాన్‌పల్లి గ్రామానికి చెందిన లింగవ్వగా గుర్తించారు. భర్త మరణం తర్వాత అప్పుల భారం భరించలేక పాల్పడినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.