News October 11, 2024

తుని: చెరువులో మద్యం సీసాలు.. ఎగబడిన మద్యం ప్రియులు

image

తుని మండలం రాపాక శివారు చెరువులో 10 నుంచి 15 మూటల్లో మద్యం సీసాలు ఉండటంతో గురువారం స్థానికులు వాటి కోసం ఎగబడ్డారు. చెరువులో మద్యం ప్రియులు సీసాలను గంటల వ్యవధిలోనే తీసుకుపోయారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడకి చేరుకొని విచారణ చేపట్టారు. 2 రోజుల క్రితం కేఒ మల్లవరంలో మద్యం కేసులో నలుగురిని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారు భయపడి మద్యం సీసాలు చెరువులో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Similar News

News December 6, 2025

రాజమండ్రి: విద్యార్థులకు ముఖ్య గమనిక

image

నన్నయ విశ్వవిద్యాలయం రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లలోని పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్స్ ఈ నెల 8 నుండి 12వ తేదీ వరకు రాజమండ్రి క్యాంపస్‌లో నిర్వహిస్తున్నామని వీసీ ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శనివారం వర్సిటీలో ఈ వివరాలు వెల్లడించారు. ఎం.ఏ., ఎం.కామ్, ఎం.పీ.ఈడీ, ఎంఎస్సీ ప్రోగ్రామ్స్‌కు ఈ అడ్మిషన్స్ ఉంటాయని వీసీ పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

News December 6, 2025

10 లోపు సంతకాల సేకరణ పూర్తి చేయాలి: చెల్లుబోయిన

image

కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి ఈ నెల 10వ తేదీన జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేయాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ఆదేశించారు. అనంతరం 13వ తేదీన వాటిని కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపనున్నట్లు ఆయన తెలిపారు. బొమ్మూరు పార్టీ కార్యాలయం నుంచి జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తి అధ్యక్షతన శనివారం నిర్వహించిన గూగుల్ మీట్ సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు.

News December 6, 2025

8న పీజీఆర్‌ఎస్ కార్యక్రమం: కలెక్టర్

image

డిసెంబర్ 8న రాజమండ్రి కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల, గ్రామ సచివాలయ స్థాయిల్లో PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రజల అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ప్రధాన లక్ష్యమన్నారు. అర్జీదారులు తమ వినతిపత్రాలను Meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని ఆమె చెప్పారు.