News March 8, 2025

తుని: టీడీపీలో చేరిన వైస్ ఛైర్‌పర్సన్ రూపాదేవి 

image

తుని మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి అధికారికంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ పెద్దలతో కలిసి తేటగుంట క్యాంప్ కార్యాలయానికి వచ్చిన రూపాదేవి, లాంఛనప్రాయంగా టీడీపీలో చేరారు. ఇప్పటికే ప్రభుత్వ విప్ యనమల దివ్యను మర్యాదపూర్వకంగా కలిసిన రూపాదేవి, పార్టీకి మద్దతు ప్రకటించారు. అనంతరం, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆమెకు పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Similar News

News November 23, 2025

SRCL: డ్రగ్స్‌కు దూరంగా ఉందాం: డబ్ల్యూఓ లక్ష్మీరాజం

image

బాల్యవివాహాలను అరికట్టాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు. శనివారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ‘నశా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ వల్ల మెదడు మొద్దుబారడం, కండరాలు పనిచేయకుండా పోవడం వంటి దుష్ప్రభావాలు కలుగుతాయని విద్యార్థులకు వివరించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా సన్మార్గంలో నడవాలని అన్నారు.

News November 23, 2025

నాగర్ కర్నూల్ జిల్లా TODAY.. టాప్ NEWS

image

*NGKL నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే పర్యటన
*పెద్దకొత్తపల్లి: రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు
*వెల్దండ: పాఠశాలలో మొక్కలు నాటిన డీఈవో
*NGKL: నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ధర్నా- సీఐటీయూ
*బల్మూర్: ఇందిర మహిళా శక్తి చీరలు పంపిణీ- ఎమ్మెల్యే
*పెద్దకొత్తపల్లి: ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ
*చారకొండ: విజయవంతమైన ఉచిత డయాబెటిస్ వైద్య శిబిరం
*బిజినేపల్లి: నాటు వైద్యం వికటించి మహిళా మృతి

News November 23, 2025

GDK: స్టడీ సెంటర్‌లో డిగ్రీ విద్యార్థులకు తరగతులు ప్రారంభం

image

డా॥BR.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం గోదావరిఖని స్టడీ సెంటర్‌లో డిగ్రీ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ తరగతులు ప్రారంభమైనట్లు కో-ఆర్డినేటర్‌ డా॥ జీ.సుబ్బారావు, కళాశాల ప్రిన్సిపల్‌ జైకిషన్‌ ఓజా ఒక ప్రకటనలో తెలిపారు. 1st Year విద్యార్థులకు 1st SEM, 2nd Year విద్యార్థులకు 3rd SEM, 3rd Year విద్యార్థులకు 6th SEM ప్రతి ఆదివారం 9AM నుంచి 5PM వరకు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు హాజరుకావాలన్నారు