News March 8, 2025

తుని: టీడీపీలో చేరిన వైస్ ఛైర్‌పర్సన్ రూపాదేవి 

image

తుని మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి అధికారికంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ పెద్దలతో కలిసి తేటగుంట క్యాంప్ కార్యాలయానికి వచ్చిన రూపాదేవి, లాంఛనప్రాయంగా టీడీపీలో చేరారు. ఇప్పటికే ప్రభుత్వ విప్ యనమల దివ్యను మర్యాదపూర్వకంగా కలిసిన రూపాదేవి, పార్టీకి మద్దతు ప్రకటించారు. అనంతరం, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆమెకు పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Similar News

News February 11, 2026

భద్రాద్రి జిల్లాలో మూడు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్

image

కౌంటింగ్ నిర్వహణ కోసం జిల్లాలో మూడు కౌంటింగ్ కేంద్రాలను గుర్తించి నోటిఫై చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌కు అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాల, ఇల్లందు మున్సిపాలిటీకి సింగరేణి కమ్యూనిటీ హాల్ (24 ఏరియా), అశ్వారావుపేట మున్సిపాలిటీకి వ్యవసాయ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా ప్రాంగణాల్లో రిసెప్షన్ కేంద్రాలు సిద్ధం చేశామన్నారు

News February 11, 2026

పాదగయలో సామాన్యులకే పెద్దపీట.. VIPలకు ప్రత్యేక సమయాలు!

image

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం కాకినాడ కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ, వీఐపీలు, ప్రోటోకాల్ దర్శనాలకు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు మాత్రమే సమయం కేటాయించారు. అత్యంత పవిత్రమైన లింగోద్భవ సమయంలో అంతరాలయ దర్శనాలను రద్దు చేశారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

News February 11, 2026

తిరుపతి: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

image

తిరుపతి, చిత్తూరు జిల్లాలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. భవిష్యత్తులో 10 మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం. అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే ఫీజు చెల్లించిన విద్యార్థులు మీ వివరాల్లో తప్పులు ఉంటే రేపటి(FEB 12) లోగా సరిచేసుకోవాలి. HMలను సంప్రదించి విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఫొటో, సంతకం మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మార్చడం వీలుండదని DEO KVN కుమార్ చెప్పారు.