News March 23, 2025
తుని: భక్తులు అభిప్రాయాలను క్యూఆర్ కోడ్‌తో స్వీకరణ

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఏపీ దేవాదాయ శాఖ క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టింది. ఈ చర్యలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ లోవ దేవస్థానంలో శనివారం దేవస్థాన కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథ రాజు QR కోడ్ బోర్డులను ఆవిష్కరించబడింది.ఈ QR కోడ్ ద్వారా భక్తులు తమ దర్శన అనుభవాన్ని, ఆలయ సౌకర్యాలపై అభిప్రాయాలను నేరుగా అధికారులకు తెలియపరచవచ్చు అని ఈవో తెలిపారు.
Similar News
News December 6, 2025
జగన్‌కు దేవుడంటే లెక్కలేదు: సీఎం చంద్రబాబు

AP: వైసీపీ పాలనలోనే నేరస్థులు తయారయ్యారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రౌడీ షీటర్లు, లేడీ డాన్ల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ జగన్‌కు దేవుడు, ఆలయాల పవిత్రత అంటే లెక్కలేదని మండిపడ్డారు. బాబాయ్ హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన ఆయన పరకామణి చోరీ కేసునూ సెటిల్ చేయాలని చూశారని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.
News December 6, 2025
అవినీతి నిర్మూలనకు మాతో కలిసి నడవండి: ఎస్పీ

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వారోత్సవాల సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతిని నిర్మూలించడానికి ప్రజలు పోలీసులతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగినా, డిమాండ్ చేసినా వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ చెప్పారు.
-SHARE IT
News December 6, 2025
చరిత్ర సృష్టించిన డికాక్

మూడో వన్డేలో భారత్‌పై సెంచరీ చేసిన(83 బంతుల్లో 106) డికాక్ అరుదైన రికార్డు సృష్టించారు. ఒకే టీమ్‌పై అత్యధిక సెంచరీలు(7) చేసిన వికెట్ కీపర్‌గా నిలిచారు. ఆ తర్వాత గిల్‌క్రిస్ట్(6)vsSL, సంగక్కర(6)vsIND ఉన్నారు. అలాగే వన్డేల్లో అత్యధిక శతకాలు(23) బాదిన వికెట్ కీపర్‌గా సంగక్కర సరసన చేరారు. అలాగే భారత్‌పై హయ్యెస్ట్ సెంచరీలు(7) చేసిన ప్లేయర్‌గా జయసూర్యతో సమానంగా నిలిచారు.


