News February 25, 2025
తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ టీడీపీలోకి చేరిక

తునిలో వైసీపీకి మరో షాక్ తగిలింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ఛైర్ పర్సన్ ఏలూరు సుధారాణి రాజీనామా చేసిన కొన్ని గంటలకే ఆరుగురు కౌన్సిల్ సభ్యులు టీడీపీ గూటికి చేరారు. తాజాగా సోమవారం సాయంత్రం హైదరాబాదులో యనమల దివ్య సమక్షంలో వైస్ ఛైర్మన్ కూచ్చర్లపాటి రూపా దేవి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికీ టీడీపీ బలం 16కు చేరుకుంది.
Similar News
News March 25, 2025
సంగారెడ్డి: నవోదయ ఫలితాలు విడుదల

నవోదయ పాఠశాలలో ఆరవ తరగతిలో ప్రవేశాల పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. నవోదయ విద్యాలయ సమితి(JNVST-2025) ప్రవేశ పరీక్ష జనవరి 18న నిర్వహించగా ఇవాళ ఫలితాలు విడుదలైనట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్ష రాసిన విద్యార్థులు https://cbseit.in/cbse/2025/nvs_result/Result.aspx ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.
-SHARE IT
News March 25, 2025
వేసవిలో చెమట వాసన వేధిస్తోందా?

వేసవిలో శరీరం నీటిని ఎక్కువగా కోల్పోయి చెమట విపరీతంగా వస్తుంది. దీంతో చెడు వాసన వచ్చి అసౌకర్యానికి గురిచేస్తుంది. దీని నుంచి ఉపశమనం పొందడానికి ఆహారంలో నిమ్మకాయ రసం, పెరుగు తప్పనిసరి చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి చెడు వాసన కలిగించే బ్యాక్టీరియాతో పోరాడేందుకు సాయపడతాయంటున్నారు. రోజ్ వాటర్ లేదా యూకలిప్టస్ ఆయిల్ కలిపిన నీటితో స్నానం చేస్తే చెమట వాసన తగ్గుతుందని సూచిస్తున్నారు.
News March 25, 2025
నంద్యాల: ‘అందరూ ఈకేవైసీ చేయించుకోవాలి’

నంద్యాల జిల్లాలోని 15, 77, 936 రేషన్ కార్డుదారుల్లో ఇప్పటి వరకు 14,04,647 మంది ఈకేవైసీ చేయించుకున్నారని, మిగిలిన వారు వెంటనే చేయించుకోవాలని జేసీ విష్ణుచరణ్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. 1,73,289 మంది కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోలేదని చెప్పారు. కార్డుదారులందరూ తప్పనిసరిగా గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్, రేషన్ షాపులోని ఈ-పాస్ మిషన్ల ద్వారా ఈకేవైసీని అప్డేట్ చేయించుకోవాలని సూచించారు.