News February 17, 2025
తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక.. 144 సెక్షన్

తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరికాసేపట్లో కౌన్సిల్ హాల్‌లో జరగనుంది. అనేక వివాదలతో ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే 10 మంది కౌన్సిల్ సభ్యులు YCP నుంచి టీడీపీలోకి చేరారు. పట్టుకోల్పొకుండా వైసీపీ కౌన్సిల్ సభ్యులను శిబిరాలకు తరలించారు.
Similar News
News March 16, 2025
శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చేస్తారా: భూమన

కడపలోని కాశీనాయన క్షేత్రాన్ని కూల్చడం దారుణమని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. టైగర్ జోన్ కావడంతో కూల్చామని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం చూస్తే శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చేస్తారన్న అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై CM నుంచి ఒక్క మాట కూడా రాలేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌పై సైతం ఆయన విమర్శలు గుప్పించారు. ‘పవనా నంద స్వామి.. దీనిపై తమరు ఎందుకు మాట్లాడటం లేదు’ అని ప్రశ్నించారు.
News March 16, 2025
మహిళా రక్షణ మా ప్రథమ కర్తవ్యం: ఎస్పీ

ప్రకాశం జిల్లాలోని మహిళలు, చిన్నారుల రక్షణకు శక్తి టీంలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఆరు బృందాలుగా 36 మందితో శక్తి టీమ్స్ ఏర్పాటు చేసి జెండా ఊపి ప్రారంభించారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ రూపొందించిన “శక్తి” యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శక్తి టీమ్స్ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.
News March 16, 2025
మధ్యాహ్నం వీటిని తింటున్నారా?

మధ్యాహ్న భోజనంలో కచ్చితంగా సలాడ్లు ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అలాగే తెల్ల అన్నంకు బదులు క్వినోవా, బ్రౌన్ రైస్ లాంటి తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. బాగా వేయించిన కర్రీలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే బంగాళాదుంప, ప్రాసెస్డ్ ఫుడ్, మసాలా పదార్థాల జోలికి వెళ్లొద్దు.