News March 10, 2025

తుని: యనముల రామకృష్ణుడుకు దక్కని అవకాశం

image

యనమల రామకృష్ణుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నారు పార్టీలో నంబర్‌2 గా ఉన్నారు. ఇటీవల ఆయన కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి లేఖ రాశారు. దాంతో ఆయనపై అధిష్టానం గుర్రుగా ఉంది. ఈ నెల 29న ఎమ్మెల్సీగా ఆయన పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో ఆయనకు మరో ఛాన్స్ ఉంటుందని భావించారు. కానీ చంద్రబాబు రెన్యువల్ చేయలేదు. తొలిసారి ఎలాంటి పదవి లేకుండా ఆయన ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడిందని క్యాడర్ చెబుతున్నారు.

Similar News

News December 2, 2025

చల్వాయి వార్డులను పంచుకున్న మూడు పార్టీలు..!

image

ములుగు జిల్లా గోవిందరావుపేట(M) చల్వాయి సర్పంచ్ స్థానాన్ని సయోధ్యతో కాంగ్రెస్ దక్కించుకుంది. 14 వార్డులను మూడు ప్రధాన పార్టీలు పంచుకున్నాయి. కాంగ్రెస్‌కు 7, BRSకు 4, BJPకి 3 చొప్పున తీసుకుంటూ తీర్మానించుకున్నాయి. ఉప సర్పంచ్ పదవిని BRSకు కేటాయించారు. పొలిటికల్ రింగ్‌లో నిత్యం తలపడే ఈ మూడు పార్టీలు పల్లె పోరులో మిత్రులుగా మారడం విశేషం. పదవుల పందేరంలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని నిరూపణైంది.

News December 2, 2025

ఎన్నికల ఖర్చులకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్‌ తేజస్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడో విడతలో నామినేషన్ వేయాలనుకునే వారు ముందుగానే కొత్త అకౌంట్ తీసుకుంటే నామినేషన్ ప్రక్రియ సులభమవుతుందని కలెక్టర్‌ సూచించారు.

News December 2, 2025

‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

image

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.