News March 10, 2025
తుని: యనముల రామకృష్ణుడుకు దక్కని అవకాశం

యనమల రామకృష్ణుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నారు పార్టీలో నంబర్2 గా ఉన్నారు. ఇటీవల ఆయన కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి లేఖ రాశారు. దాంతో ఆయనపై అధిష్టానం గుర్రుగా ఉంది. ఈ నెల 29న ఎమ్మెల్సీగా ఆయన పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో ఆయనకు మరో ఛాన్స్ ఉంటుందని భావించారు. కానీ చంద్రబాబు రెన్యువల్ చేయలేదు. తొలిసారి ఎలాంటి పదవి లేకుండా ఆయన ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడిందని క్యాడర్ చెబుతున్నారు.
Similar News
News February 9, 2026
12న కొమురవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి దేవస్థాన హుండీలను ఈనెల 12న లెక్కించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి నగదు, బియ్యం హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆలయ కార్యనిర్వాహక అధికారి ఒక ప్రకటనలో కోరారు.
News February 9, 2026
పబ్‌జీ ఆడుతుండగా 300 దాటిన BP.. మెదడు నరాలు చిట్లి మృతి

మేరఠ్(UP)కు చెందిన మహ్మద్ కైఫ్(22) 4నెలలుగా PUBG గేమ్‌కు అలవాటుపడ్డారు. శుక్రవారం హెడ్‌ఫోన్స్ పెట్టుకొని అర్ధరాత్రి వరకు ఆడుతూనే ఉన్నారు. ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. చెవులు, ముక్కు నుంచి రక్తం కారిన అతనికి ట్రీట్‌మెంట్ చేసినా ఆదివారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. మెంటల్ ప్రెజర్‌తో BP 300 దాటి బ్రెయిన్‌లోని నరాలు చిట్లి రక్తస్రావమైనట్లు డాక్టర్లు తేల్చారు.
News February 9, 2026
దేనికోసం బాయ్‌కాట్? పాక్‌పై గంగూలీ ఫైర్

T20 WCలో భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలనే పాకిస్థాన్ నిర్ణయంపై గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎలాగూ శ్రీలంకలో ఆడుతున్నప్పుడు ఇబ్బందేంటని ప్రశ్నించారు. అసలు దేనికోసం ఈ నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. వరల్డ్ కప్‌లో ప్రతీ పాయింట్ ముఖ్యమేనని హితవు పలికారు. బంగ్లాకు మద్దతు పలుకుతూ Feb 15న కొలంబోలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాక్ బహిష్కరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.


