News April 14, 2025
తుని: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గొల్లప్రోలు మండలం మల్లవరం రైల్వే గేట్ వద్ద ట్రైను ఢీకొని వ్యక్తి (45) మృతి చెందాడని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై వివరాలు ప్రకారం..మృతుడు శరీరంపై ఎటువంటి దుస్తులు లేవని, కుడి చేయిపై పెద్ద సైజు టాటూ, స్టీల్ కడియం ధరించి ఉన్నాడన్నారు. మృతుడు వివరాలు తెలిస్తే తుని జీఆర్పీ స్టేషన్లో సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News December 7, 2025
శ్రీసత్యసాయి: తల్లిదండ్రుల మృతి.. అనాథలైన ఇద్దరమ్మాయిలు

పరిగిలో అమ్మానాన్నలు మృతి చెందడంతో వారి ఇద్దరి అమ్మాయిలు అనాథలయ్యారు. ఎనిమిదేళ్ల క్రితం తల్లి మరణించగా.. శనివారం తెల్లవారుజామున తండ్రి భజంత్రీ గోపాల్ గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో వారి కుమార్తెలు ఇద్దరూ అనాథలయ్యారు. మండల పాత్రికేయులు తమ వంతుగా ఆ బాలికలకు ఆర్థిక సాయం అందజేసి, భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తోడుంటామని భరోసా కల్పించారు.
News December 7, 2025
ప్రకాశంలో స్క్రబ్ టైఫస్తో మహిళ మృతి.. కానీ!

ప్రకాశం జిల్లాలో ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి పాజిటివ్ వచ్చిన మహిళ మృతి చెందినట్లు ప్రకాశం DMHO వెంకటేశ్వర్లు తెలిపారు. యర్రగొండపాలెం మండలానికి చెందిన వృద్ధురాలు గతనెల 11న అనారోగ్యానికి గురైంది. అయితే మెరుగైన చికిత్స కోసం గుంటూరు GGHకు తరలించారు. 29న అక్కడ నిర్వహించిన <<18481778>>టెస్టుల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్<<>> వచ్చిందన్నారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా మృతికి కారణంగా డీఎంహెచ్వో తెలిపారు.
News December 7, 2025
సదుంలో సినిమా షూటింగ్

సదుం మండలంలోని తాటిగుంటపాలెంలో ‘నాన్న డైరీ’ సినిమా షూటింగ్ మూడు రోజులుగా జరుగుతోంది. క్లైమాక్స్ సంబంధించిన పలు దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్లు డైరెక్టర్ సురేశ్, నిర్మాత కోటి తెలిపారు. మరో మూడు రోజుల పాటు షూటింగ్ కొనసాగితే చిత్రీకరణ పూర్తి అవుతుందని వారు చెప్పారు. చిత్రంలో పీలేరుకు చెందిన ఖాదర్ బాషా, షాను, సన, సదుంకు చెందిన రచయిత, కళాకారుడు రామయ్య నటిస్తున్నట్లు వెల్లడించారు.


