News February 14, 2025

తుని రైల్వే స్టేషన్‌లో వృద్ధుడి మృతదేహం

image

తుని రైల్వేస్టేషన్‌లో బుకింగ్ కౌంటర్ వద్ద ఓ వృద్ధుడు మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాస రావు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఉన్న ఆధారాలు ప్రకారం నక్కపల్లి మండలం పెద్ద తీనార్ల గ్రామానికి చెందిన అడవి రాజు (70)గా గుర్తించామని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రి మార్చురీ రూమ్‌లో భద్రపరిచామన్నారు.

Similar News

News October 18, 2025

నిర్మల్: పీటీఎం మీటింగ్ వాయిదా

image

బీసీ బంద్ నేపథ్యంలో ప్రతినెల మూడవ శనివారం నిర్వహించే పీటీఎం (పేరెంట్ టీచర్స్ మీటింగ్) రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న ఓ ప్రకటనలో తెలిపారు. రద్దు విషయాన్ని ఆయా ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని వారు కోరారు.

News October 18, 2025

సింహాచలం ఆలయ పైకప్పుకు కొత్త అందం

image

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానం ఇప్పుడు కొత్త రూపంలో మెరిసిపోతోంది. ఆలయ ప్రధాన గర్భగృహం, కళ్యాణ మండపం, వ్రత మండపం, వంటశాలకు టెర్రాకోట పెంకులతో కొత్త పైకప్పు ఏర్పాటు చేశారు. పూణేకు చెందిన లార్డ్ వేంకటేశ్వర చారిటబుల్ అండ్ రీలిజియస్ ట్రస్ట్ సుమారు రూ.5 కోట్లతో ఈ మరమ్మతులు చేపట్టింది. పాత పద్ధతిలోనే పైకప్పును పునరుద్ధరించి, శిల్పకళా అందాన్ని కాపాడుతూ ఆలయానికి నూతన శోభను చేకూర్చింది.

News October 18, 2025

MBNR: BC బంద్.. PU పరీక్షలు వాయిదా

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో బీసీ బంద్ కారణంగా షెడ్యూల్ ప్రకారం జరగవలసిన పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు Way2Newsతో తెలిపారు. ఈ మేరకు సెమిస్టర్–IV, B-ఫార్మసీ సెమిస్టర్–II పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ కారణంగా వాయిదా వేసిన పరీక్షల తేదీలను, సమయాన్ని త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రకటించారు.