News March 26, 2025
తుని: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

తునిలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఫ్లైఓవర్పై జరిగిన ప్రమాదంలో విశాఖపట్నంకు చెందిన పద్మ (48) మృతి చెందారు. అన్నవరం నుంచి విశాఖకు కుమారుడితో కలిసి బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఐ విజయబాబు తెలిపారు. అన్నవరంలో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లి ఆమె తిరుగు ప్రయాణమైనప్పుడు ఫ్లైఓవర్పై బైకును కారు ఢీకొట్టింది. ఆమె కింద పడిపోవడంతో పైనుంచి కారు చక్రాలు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు.
Similar News
News November 22, 2025
పుట్టపర్తికి చేరుకున్న సీఎం, మంత్రి లోకేశ్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేశ్ పుట్టపర్తికి చేరుకున్నారు. వారికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకోనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సీఎం, లోకేశ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం వారు ప్రశాంతి నిలయంలో జరిగే శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు.
News November 22, 2025
తాజా సినీ ముచ్చట్లు

*రేపు ఉ.10.08 గంటలకు నాగ చైతన్య మూవీ(NC24) టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్న మహేశ్
*మహిళలు ఏకమైతే వారి శక్తిని ఎవరూ ఆపలేరు: రష్మిక
*జనవరి 8న నార్త్ అమెరికాలో 8AM PST(ఇండియాలో 9.30PM)కి ప్రభాస్ రాజాసాబ్ చిత్రం వరల్డ్ ఫస్ట్ ప్రీమియర్
*వారణాసిలో అద్భుతమైన సంగీతం ఉంటుంది. మొత్తం 6 పాటలు ఉంటాయి: కీరవాణి
*నా ‘మాస్క్’ చిత్రం విజయం సాధిస్తే.. పిశాచి-2 మూవీని నేనే రిలీజ్ చేస్తా: హీరోయిన్ ఆండ్రియా
News November 22, 2025
గర్భిణులు రోజుకెంత ఉప్పు తీసుకోవాలంటే..

గర్భిణులు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరు ఎక్కువ ఉప్పు తింటే మరికొందరు తక్కువ ఉప్పు తింటారు. కానీ గర్భిణులు రోజుకి 3.8గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరీ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే 5.8గ్రాముల వరకు తీసుకోవచ్చు. దీని కంటే ఎక్కువగా తీసుకుంటే కాళ్లు, చేతుల వాపులు, తరచుగా మూత్రవిసర్జన, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయని గైనకాలజిస్ట్లు చెబుతున్నారు.


