News February 15, 2025
తుని: 10మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్

తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక సమయం దగ్గర పడటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 12వ వార్డు బుడ్డిగా వెంకటధారేష్, 19 వార్డు కౌన్సిలర్ ఆచంట సురేష్, 24వ వార్డు కౌన్సిలర్ పులి సత్యనారాయణ, 29వ వార్డు దోసపర్తి రాజేశ్వరి,30వ వార్డు కౌన్సిలర్ సిద్ది రెడ్డి గౌరీ వనజ, 23వ వార్డు కౌన్సిలర్ కర్రీ శ్రీదేవి,28వ వార్డు చింతకాయల భారతి, 4వ వార్డు తుమ్మలపల్లి సుశీల, 18వ వార్డు నార్ల భువనేశ్వరి టీడీపీలోకి చేరారు.
Similar News
News December 24, 2025
నకిలీ వైద్యులకు కేరాఫ్ నల్గొండ

జిల్లాలో నకిలీ వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నల్గొండతోపాటు DVK, MLG, అనుముల, NKL, చిట్యాల, చండూరు తదితర ప్రాంతాల్లో నకిలీ వైద్యులు శస్త్ర చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో జిల్లాలో నకిలీ వైద్యుల బాగోతం బయటపడింది. నకిలీ వైద్యులపై జిల్లా వైద్య శాఖ అధికారులు దృష్టి సారించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.
News December 24, 2025
హాదీ హత్య వెనుక యూనస్ ప్రభుత్వం.. సోదరుడి ఆరోపణ

బంగ్లాదేశ్లో అల్లర్లకు కారణమైన ఉస్మాన్ హాదీ హత్యపై ఆయన సోదరుడు ఒమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలను అస్థిరపరిచేందుకు యూనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే ఈ హత్య చేయించారని ఆరోపించారు. కాగా హాదీపై ఈ నెల 12న కాల్పులు జరగగా ఆయన సింగపూర్లో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.
News December 24, 2025
వైభవ్ మరో సెంచరీ

విజయ్ హజారే ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ చెలరేగారు. బిహార్ తరఫున ఆడుతున్న అతను అరుణాచల్తో మ్యాచ్లో 36 బంతుల్లోనే సెంచరీ చేశారు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం డబుల్ సెంచరీ దిశగా అతని ఇన్నింగ్స్ కొనసాగుతోంది.


