News March 19, 2025
తుపాకీ చేతబట్టిన తొలి మహిళ మల్లు స్వరాజ్యం

తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టిన తొలి మహిళ మల్లు స్వరాజ్యం. తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో 1931లో భూస్వాముల కుటుంబంలో పుట్టిన ఆమె నైజాం సర్కార్కి వ్యతిరేకంగా పోరాడారు. దొరల దురహంకారంపై తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. సాయుధ పోరాటంలో తన అన్న భీంరెడ్డి నర్సింహారెడ్డితో కలిసి పోరాడిన ధీరవనిత మల్లు స్వరాజ్యం. 1978, 1983లో తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. నేడు మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి.
Similar News
News October 27, 2025
పాలమూరు: కొత్త మద్యం లైసెన్స్ దారులు ఎవరు? నేడు లక్కీడిప్

ఉమ్మడి జిల్లాలోని 227 మద్యం దుకాణాలకు కొత్త లైసెన్స్ దారులు ఎవరో నేడు తేలనుంది. మొత్తం 5,536 మంది టెండర్లు దాఖలు చేయగా, వారిలో 227 మందిని లక్కీడిప్ ద్వారా ఎంపిక చేయనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఆయా కలెక్టరేట్లలో లక్కీడిప్ నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల లక్కీడిప్ను మహబూబ్నగర్ కలెక్టరేట్లో నిర్వహిస్తారు.
News October 27, 2025
11AMకు లక్కీ డ్రా.. అదృష్టం ఎవరిని వరించేనో?

TG: మద్యం షాపులకు ఇవాళ 11AMకు అన్ని జిల్లాల్లో దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్లు లక్కీ డ్రా తీయనున్నారు. 2,620 మద్యం షాపులకు 95,137 మంది దరఖాస్తు చేసుకున్నారు. నాన్ రీఫండబుల్ ఫీజు రూ.3 లక్షలు ఉన్నప్పటికీ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఒక్క షాపు తగిలినా లైఫ్ సెట్ అవుతుందనే ఉద్దేశంతో పలువురు పదుల సంఖ్యలో అప్లికేషన్స్ పెట్టారు. మరి ఎవరి లక్ ఎలా టర్న్ అవుతుందో చూడాలి. మీరూ అప్లై చేశారా?
News October 27, 2025
సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి: DEO

తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక సూచించారు. ఎంఈవోలు మండల కేంద్రాల్లో ఉండి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. తుపాను షెల్టర్ల ఏర్పాటు కోసం తహశీల్దార్లు, ఎంపీడీవోలకు సహకరించాలని తెలిపారు. డీఈవో కార్యాలయంలోనూ 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు రేణుక చెప్పారు.


