News August 9, 2024

తుపాకీ లైసెన్స్‌‌కు దువ్వాడ దరఖాస్తు

image

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తనకు తుపాకీ లైసెన్స్ మంజూరు చేయాలని కోరుతూ ఎస్పీ మహేందర్ రెడ్డికి తాజాగా ఈనెల 7న దరఖాస్తు చేసుకున్నారు. తనకు కొంత మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, కొంత మంది తన ఇంటి వద్ద అనుమానంగా రెక్కీ నిర్వహిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన వద్ద ఉన్న తుపాకీకి లైసెన్స్ మంజూరు చేయాలని కోరారు. ఇదే విషయమై జులైలో కూడా టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News September 8, 2024

శ్రీకాకుళం జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

రానున్న 2 రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. మత్స్యకారులు 3 రోజులు వేటకు వెళ్లొద్దని, నదీ పరిహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా భారీ నష్టాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 08942-240557కు ఫోన్ చేయాలని, అలాగే ఈ-మెయిల్ ఐడీ cosklmsupdtd@gmail.com ద్వారా ఫొటోలను పంపించాలని తెలిపారు.

News September 7, 2024

శ్రీకాకుళం: మరో మూడు రోజులు భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.