News November 15, 2024

తుఫాన్ల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడ్డారు: ప.గో కలెక్టర్

image

ప.గో.జిల్లా కలెక్టరేట్లో నీటిపారుదల సలహా మండలి సమావేశం కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మూడుసార్లు తుఫాన్‌లు వచ్చాయని.. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. అధికారులు సంబంధిత ఇరిగేషన్ పనులపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో 9 ప్రధాన కాలువలు ద్వారా 4,03,001 ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతుందన్నారు. 

Similar News

News November 16, 2024

పోలవరం 45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మించాలి: నారాయణ

image

ఏలూరు జిల్లా స్ఫూర్తి భవనంలో శుక్రవారం కొల్లేరు పరిరక్షణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే రిజర్వాయర్‌గా మారే ప్రమాదం ఉందని, విద్యుత్తు ఉత్పత్తిలో ఆటకం ఏర్పడుతుందన్నారు. రుషికొండ కట్టడాల్ని పర్యాటకరంగానికి వినియోగిస్తే ఆదాయం వస్తుందన్నారు.

News November 15, 2024

వైసీపీకి నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ రాజీనామా

image

నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ ఛైర్మన్ గంగుల వెంకటలక్ష్మితో పాటు మరో తొమ్మిది మంది కౌన్సిలర్లు వైసీపీ శుక్రవారం సాయంత్రం రాజీనామా చేశారు. నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు విధానాలు వ్యతిరేకిస్తూ తామంతా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కౌన్సిల్లో మొత్తం 28 మంది సభ్యులకు గాను 27 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉండగా 11 మంది రాజీనామా చేశారు.

News November 15, 2024

ఏలూరు: ఎస్పీ కార్యాలయంలో దివాస్ కార్యక్రమం

image

ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బంది సంక్షేమ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది వద్ద నుంచి ఎస్పీ ప్రతాప్ కిషోర్ అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సమగ్రంగా అడిగి తెలుసుకొని వాటిపై సత్వరమే తగు పరిష్కార చర్యలు తీసుకుంటామని పోలీస్ సిబ్బందికి భరోసా కల్పించారు.