News November 15, 2024
తుఫాన్ల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడ్డారు: ప.గో కలెక్టర్
ప.గో.జిల్లా కలెక్టరేట్లో నీటిపారుదల సలహా మండలి సమావేశం కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మూడుసార్లు తుఫాన్‌లు వచ్చాయని.. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. అధికారులు సంబంధిత ఇరిగేషన్ పనులపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో 9 ప్రధాన కాలువలు ద్వారా 4,03,001 ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతుందన్నారు.
Similar News
News December 9, 2024
అధికారులను అలర్ట్ చేశాం: కలెక్టర్
ఏలూరు జిల్లా రైతులు తమ సమస్యలను నెం.18004256453, 08812-230448, 7702003584 ఫోన్ చేసి తెలపాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. సోమవారం కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న 48 గంటల్లో జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులను అలర్ట్ చేశామన్నారు. రైతుల సమస్యలను దగ్గరలోని అధికారులకు తెలపాలన్నారు.
News December 9, 2024
గోపాలపురంలో రోడ్డు ప్రమాదం.. తల్లీకూతుళ్లు మృతి
గోపాలపురం మండలం దొండపూడిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. బైక్‌పై వెళ్తున్న తల్లీకుమార్తెలు ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో మరో ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్రగాయలైన వారిని స్థానికులు వైద్యం కోసం రాజమండ్రి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. మృతులు పోలవరం(M) బండార్లగూడెంకు చెందిన కాంతమ్మ(45), గన్నమ్మ(75)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News December 9, 2024
ప.గో: ’10వ తేది లాస్ట్.. తప్పులుంటే సరి చేసుకోండి’
ప.గో జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10 తరగతి, ఇంటర్ విద్యార్థులు తమ వివరాల్లో తప్పులుంటే సరి చేసుకోవాలని డీఈవో నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తప్పులు ఉంటే సంబంధింత పత్రాలతో సరిచేసుకోవాలన్నారు. డిసెంబర్ 10తో గడువు ముగుస్తుందన్నారు. జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ఏఐ కోఆర్డినేటర్లు విద్యార్థులకు ఈ విషయం తెలిసేలా సందేశాలు ఇవ్వాలన్నారు.