News May 25, 2024
తుఫాన్ ఎఫెక్ట్.. నెల్లూరులో చల్లబడ్డ వాతావరణం
నెల్లూరు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మిట్ట మధ్యాహ్నం మబ్బులు కమ్ముకున్నాయి. నెల్లూరు జిల్లావ్యాప్తంగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్ట్లో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 22, 2025
కలెక్టర్ సమక్షంలో విద్యాశాఖ పునర్విభజన సన్నాహక సమావేశం
పాఠశాలల పునర్విభజన బోధన సిబ్బంది పునర్నిర్మాణం సన్నాహక సమావేశం నెల్లూరు నగరంలోని జిల్లా కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ సమక్షంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోను తూచా తప్పకుండా పాటించాలని, గ్రామస్థుల సూచనలు, వారిని సమన్వయం చేయాలని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బాలాజీ రావు కొన్ని సూచనలు, మార్పులను ప్రతిపాదించారు.
News January 21, 2025
బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఇతనే
బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా సీపాన వంశీధర్ రెడ్డి మళ్లీ ఎన్నికయ్యారు. రాష్ట్ర, కేంద్ర నాయకత్వం వంశీధర్ రెడ్డిని ఎంపిక చేసిందని రాష్ట్ర పరిశీలకులు ప్రకటించారు. ఈ సందర్భంగా తిరిగి వంశీధర్ రెడ్డి ఎన్నిక పట్ల బీజేపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
News January 21, 2025
నెల్లూరులో ఇద్దరు సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు
నెల్లూరు జిల్లాలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను, నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసిన ఇద్దరు సర్పంచ్లపై కలెక్టర్ ఓ ఆనంద్ చర్యలు చేపట్టారు. కొడవలూరు మండలం పెమ్మారెడ్డి పాలెం పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, గతంలో పనిచేసిన మధుసూదన్, రేగడిచెలిక పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్లను సస్పెండ్ చేశారు. రేగడిచెలిక, పెమ్మారెడ్డి పాలెం సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేశారు.