News January 10, 2026

తుర్కపల్లి: గుప్తనిధుల కోసం తవ్వకాలు.. ఆరుగురు అరెస్ట్

image

మాదాపూర్ గ్రామ శివారులో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్సై తక్యుద్దీన్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ఒక హిటాచీ, కారు, పూజ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News January 23, 2026

ASF: మెడికల్ ల్యాబ్‌ల పేరిట దోపిడీ

image

జిల్లాలో అక్రమ మెడికల్ ల్యాబ్‌ల దందా విచ్చలవిడిగా సాగుతోంది. అర్హత లేకున్నా రక్త పరీక్షల కేంద్రాలు నిర్వహిస్తూ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఒక్కో పరీక్షకు ఒక్కో ధర వసూలు చేస్తున్నారు. కొంతమంది వైద్యులు కమీషన్ల కోసం అవసరం లేకున్నా రోగులను ఈ ల్యాబ్‌లకు పంపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.

News January 23, 2026

అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన జరిగింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిని సమీక్షించిన ఆయన, విచారణను వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందాల్సిన పరిహారాన్ని సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

News January 23, 2026

వరల్డ్ కప్‌కు రోహిత్ కెప్టెన్సీ? మాజీ క్రికెటర్ రెస్పాన్స్ ఇదే..

image

టీమ్ ఇండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఫెయిల్ అవుతున్నారని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. గిల్ నాయకత్వంలో AUS, NZతో జరిగిన సిరీస్‌లను భారత్ కోల్పోవడంతో అతణ్ని కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 2027 వరల్డ్ కప్ కోసం మళ్లీ రోహిత్ శర్మకే పగ్గాలు అప్పగించాలని BCCIకి సూచించారు. రోహిత్ ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని, ఈ మార్పు వెంటనే జరగాలని అభిప్రాయపడ్డారు.