News April 4, 2025
తుర్కపల్లి: పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్

తుర్కపల్లి మండలంలో కురిసిన అకాల వర్షాల వల్ల నష్టం జరిగిన పంట పొలాలను కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టపోయిన పంటల వివరాలను తెలుసుకున్నారు. మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిలిందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కాగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం వివరాలను అంచనా వేయాలని వ్యవసాయ అధికారులను ఆయన ఆదేశించారు.
Similar News
News April 20, 2025
ఇవాళ బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి

TG: 2025-26కు గాను BC గురుకుల స్కూళ్లలో ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతి సీట్ల భర్తీకి ఇవాళ పరీక్ష జరగనుంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 6,832 బ్యాక్లాగ్ సీట్లకు గాను 26,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 109 పరీక్ష కేంద్రాల్లో ఉ.10 గంటల నుంచి మ.12గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్టికెట్లు తీసుకెళ్లాలి. ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదు.
News April 20, 2025
సంగారెడ్డి జిల్లాలో 218 కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్

జిల్లాలో 95,687 ఎకరాల్లో వరి పంట సాగు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. కలెక్టరేట్ నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందులో దొడ్డు ధాన్యం 88,033 ఎకరాల్లో, సన్న ధాన్యం 7,654 ఎకరాల్లో సాగు చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 218 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదరపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు.
News April 20, 2025
వరంగల్: ‘గిరికతాటి’ కల్లుకు కేరాఫ్ ‘పాకాల’

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరకతాటి కల్లు ఎక్కడ దొరుకుతుందంటే ఠక్కున గుర్తొచ్చేది ఖానాపురం మండలం పాకాల. నర్సంపేట నుంచి పాకాలకు వెళ్లే దారి మధ్యలో సుమారు 60 గిరికతాటి చెట్లు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవి, పక్కనే పాకాల వాగు వద్ద దొరికే ఈ కల్లు కోసం HYD, WGL, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రతి ఏటా వేలం పాటలో గీతకార్మికులు ఈ చెట్లను దక్కించుకుంటారు. ఇక్కడ కుండ చికెన్ కూడా ఫేమస్.