News February 17, 2025
తుర్కపల్లి: మోడల్ స్కూల్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్

మోడల్ స్కూల్ పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శోభారాణి తెలిపారు. 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లిష్, 26న గణితం, 28, 29న సైన్స్, ఏప్రిల్ 2న సోషల్, ఏప్రిల్ 4న ఒకేషనల్ పరీక్షలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఎగ్జామ్స్ ఉంటాయన్నారు.
Similar News
News March 22, 2025
10వ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జనగామ కలెక్టర్

జనగామ పట్టణ కేంద్రంలోని పలు పాఠశాలల్లో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారులకు సూచించారు. సహాయ సంచాలకులు రవి కుమార్, చీఫ్ సూపరింటెండెంట్ శోభన్, సత్యనారాయణ తదితరులున్నారు.
News March 22, 2025
ఆ రైతులకు పరిహారం చెల్లించాలి: బండి

TG: గత పదేళ్లలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనూ ఆదుకున్న దాఖలాలు లేవని దుయ్యబట్టారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమే సర్వే చేసి వారం రోజుల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. మరోవైపు ప్రజల దృష్టి మరల్చేందుకు డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారని ఫైరయ్యారు.
News March 22, 2025
జూలూరుపాడు: ‘ఉపాధి కూలీలకు రూ.600 ఇవ్వాలి’

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రోజు వేతనం కింద రూ.600 ఇవ్వాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు బానోతు ధర్మ డిమాండ్ చేశారు. జూలూరుపాడులో ఉపాధి పని ప్రదేశాలను సంఘం నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలకు మజ్జిగ, మంచి నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.