News October 8, 2024
తుళ్ళూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఘర్షణ
కుటుంబ కలహాల నేపథ్యంలో ఘర్షణ జరిగిన ఘటన తుళ్ళూరులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంభంపాటి శేషగిరిరావు, పావని దంపతులు. కొంతకాలంగా అత్త, కోడలికి మధ్య వైరం నడుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం కోడలి తరఫు బంధువులు, అత్తవైపు వారు గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో కోడలు అత్త చెవి కొరకడంతో సగభాగం ఊడి కింద పడిపోయింది. గుంటూరు ఆస్పత్రికి తీసుకెళ్లినా అతికించలేమని వైద్యులు చెప్పారు.
Similar News
News November 13, 2024
పెదకాకానిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
పెదకాకాని మండలంలో గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం పర్యటించారు. మండల కేంద్రంలోని గౌడపాలెం అంగన్వాడీని సందర్శించి ఇంకుడు గుంట ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్రంలోని వసతులు, విద్య, టాయిలెట్లు, ఆహార పదార్థాలు, వాటి నాణ్యత గురించి అంగన్వాడీ టీచర్, ఆయాలను అడిగి తెలుసుకున్నారు. పెదకాకాని మండలంలోని పుష్పరాజ్ కాలనీ సీసీ రోడ్డు ఏర్పాట్లను పరిశీలించారు.
News November 13, 2024
రామ్ గోపాల్ వర్మపై కేసు.. వివరాలు ఇవే.!
సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై తుళ్ళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేశ్‌లపై అసభ్యంగా పోస్టులు పెట్టారని పెదపరిమి గ్రామానికి చెందిన నూతలపాటి రామారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా U/S 336(4), 353(2), 356(2), 61(2), 196, 352 BNS, Sec. 67 ఆఫ్ IT యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News November 13, 2024
ఆయనపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్డు
వేమూరు మాజీ MLA మేరుగు నాగార్జున క్వాష్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో మేరుగుపై పద్మావతి అనే మహిళ అత్యాచారం కేసు పెట్టగా.. ఇటీవల కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. కేసును ఏం చేస్తారని హైకోర్టు పోలీసులను అడిగింది. రిటర్న్ రిపోర్టు ఇవ్వాలంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.