News March 15, 2025

తూగో జిల్లా ఇన్‌ఛార్జ్ డీఎస్‌వోగా భాస్కర్ రెడ్డి

image

తూర్పు గోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్ పౌర సరఫరాల శాఖ అధికారి(డీఎస్‌వో)గా కేఆర్ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాజమండ్రిలోని కలెక్టరేట్ ఆవరణలో ఉన్న పౌర సరఫరాల శాఖ అధికారి కార్యాలయంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. కే ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌తో పాటు జిల్లా హౌసింగ్ పీడీగా భాస్కర్ రెడ్డి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Similar News

News February 6, 2026

రాజమండ్రి: అభ్యర్థులు గమనించాలి.. పరీక్ష తేదీ, కేంద్రం మార్పు

image

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(DLSA) నియామక పరీక్షల తేదీ, కేంద్రంలో మార్పులు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత శుక్రవారం ప్రకటించారు. ఈనెల 8న జరగాల్సిన పరీక్షను 11వ తేదీకి మార్చారు. అలాగే పరీక్షా కేంద్రాన్ని మహిళా కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాలకు మార్చినట్లు వెల్లడించారు. అభ్యర్థులు తమ పోస్టులకు కేటాయించిన రిపోర్టింగ్ సమయాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

News February 6, 2026

8న జిల్లా టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

image

జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం రాజమండ్రి జవహర్ లాల్ నెహ్రూ రోడ్డులో చెరుకూరి వీర్రాజు కన్వెక్షన్ హాల్లో జరుగనుంది. 8న బూరుగుపూడి గేట్ నుంచి భారీ ర్యాలీలో టీడీపీ శ్రేణులు పాల్గొనున్నారు. జిల్లా అగ్ర నాయకుల సమక్షంలో టీడీపీ జిల్లా రథసారథి, కార్యవర్గ సభ్యులు ప్రమాణం మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News February 6, 2026

ఉగాది నాటికి 8,378 ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి: పీడీ

image

తూర్పు గోదావరి జిల్లా హౌసింగ్ అధికారులతో పీడీ నాతి బుజ్జి సమీక్ష నిర్వహించారు. ఉగాది–2026 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల గృహ ప్రవేశాలు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లాకు కేటాయించిన 8,378 ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లలోకి ప్రవేశించేలా క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.