News February 6, 2025
తూప్రాన్‌లో వ్యక్తి కుళ్లిన శవం లభ్యం

తూప్రాన్ పట్టణంలో ఓ ఇంట్లో వ్యక్తి కుళ్లిన మృతదేహాన్ని గుర్తించారు. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన వడియారం మల్లేశం(48) భార్యా పిల్లలతో గొడవ కారణంగా ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నాడు. మద్యానికి బానిసైన మల్లేశం ఇంట్లో 10 రోజుల క్రితం చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. దుర్వాసన రావడంతో ఈరోజు తలుపులు తొలగించి చూడగా మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News December 17, 2025
BREAKING: మెదక్ జిల్లాలో తొలి ఫలితం

మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో చిలిప్ చేడ్ మండలం గుజిరి తండా గ్రామ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి రామావత్ సుజాత ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మూడావత్ రుక్మిణిపై 14 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆమె గెలుపొందారు. సుజాత విజయం ఖరారు కావడంతో అనుచరులు, పార్టీ నాయకులు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుతూ గ్రామంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.
News December 17, 2025
MDK: ఎన్నికల్లో ముగ్గురు బాల్య మిత్రులు గెలుపు

తూప్రాన్ మండలం ఘనాపూర్ జీపీలో బాల్యమిత్రులు వార్డు సభ్యులుగా విజయం సాధించారు. ఎస్ఎస్సీ బాల్య మిత్రులైన సురేష్, వేణు, సయ్యద్ అన్వర్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని నిశ్చయించుకున్నారు. వేణు, సురేష్‌లకు వార్డులలో సభ్యులుగా పోటీ చేయడానికి రిజర్వేషన్ అనుకూలించింది. అన్వర్‌కు అనుకూలించకపోవడంతో తల్లి నజ్మా బేగంను ఎన్నికలలో నిలిపారు. సురేష్, వేణు, నజ్మా బేగం, (అన్వర్ తల్లి) వార్డు సభ్యులుగా గెలిచారు.
News December 17, 2025
మెదక్: రుణదాతల వేధింపులతో వ్యక్తి సూసైడ్

అప్పు ఇచ్చినవారు వేధించడంతో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పట్టణంలోని కువత్ ఇస్లాంకు చెందిన మహమ్మద్ షాదుల్లా హుస్సేన్ (45) పట్టణంలో పోస్ట్ ఆఫీస్ సమీపంలో టీ స్టాల్ నడుపుతూ జీవిస్తున్నాడు. రూ.30 లక్షలు అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారు వేధించడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి ఫాతిమా టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


