News March 14, 2025
తూప్రాన్: ఎల్ఆర్ఎస్ పై స్పెషల్ ఆఫీసర్ సమావేశం

తూప్రాన్ మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ పై ప్రత్యేక అధికారి (జెడ్పీ సీఈవో) ఎల్లయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ ప్రత్యేక అధికారిగా నియామకమైన జడ్పీ సీఈఓ ఎల్లయ్య మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లతో ఎల్ఆర్ఎస్ పై సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న వారు 31లోగా రుసుము చెల్లించి రాయితీ పొందాలని సూచించారు. కమిషనర్ గణేష్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News March 15, 2025
మెదక్: రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్డీఓ సమావేశం

మెదక్ ఆర్డీవో రమాదేవి తన కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఫారం-6, 8ల గురించి రాజకీయ పార్టీ ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఓటరు జాబితా నిరంతర నమోదు, బూత్ స్థాయి ప్రతినిధుల నియామకం గురించి చర్చించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు అధికారులు సమాధానం ఇచ్చారు. తహసీల్దార్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
News March 15, 2025
రేపు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు: ఆంజనేయులు

రేపు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు. నర్సాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో స్పీకర్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కార్యకర్తలను కోరారు.
News March 15, 2025
మెదక్: యువకుడు ఊరేసుకుని ఆత్మహత్య

యువకుడు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ పట్టణం బారా ఇమాంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌కు చెందిన అరవింద్ (26) ఫతేనగర్‌లో ఉంటూ ఆర్టీసీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మెదక్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.