News February 12, 2025

తూప్రాన్: చెరువులో పడి 6ఏళ్ల చిన్నారి మృతి

image

తూప్రాన్ పెద్ద చెరువులో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన చాంద్ పాషా, పర్వీన్ కుమార్తె జుబేరియా(6) బుధవారం ఉదయం తల్లితో కలిసి పెద్ద చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లింది. ఈ క్రమంలో తల్లి బట్టలు ఉతుకుతుండగా మెట్లపై ఆడుకుంటున్న జుబేరియా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 13, 2025

ఉన్నత స్థానంలో స్థిరపడాలి: అడిషనల్ కలెక్టర్

image

ప్రతి విద్యార్థి బాగా చదువుకొని జీవితంలో ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆకాంక్షించారు. హవేలీ ఘన్పూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలో వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మమేకమై మెనూ పరిశీలించి వారితో కలిసి భోజనం చేశారు. పిల్లల బాగోగులు తెలుసుకున్నారు.

News February 13, 2025

మెదక్: కాంగ్రెస్‌లో చేరిన మాజీ డీఎస్పీ 

image

మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎం.గంగాధర్ బుధవారం ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల గంగాధర్ డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నాలుగు జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు.

News February 13, 2025

చేగుంట: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీలకు సువర్ణ

image

చేగుంట ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సైని సువర్ణ ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు సీడీపీఓ స్వరూప, డీడబ్ల్యుఓ హైమావతి తెలిపారు. గతనెల 23, 24 తేదీలలో హైదరాబాద్ ఇండోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ వాలీబాల్ టోర్నమెంట్‌లో ప్రతిభ చూపి ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల 14 నుంచి 18 వరకు చెన్నైలో జరిగే పోటీల్లో పాల్గొంటున్నట్లు వివరించారు.

error: Content is protected !!