News October 24, 2024

తూప్రాన్: స్టడీ హాల్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

image

తూప్రాన్ పట్టణ శివారులోని టోల్ ప్లాజా వద్ద గల తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఐటీసీ కంపెనీ వారు కట్టిన స్టడీ హాల్ ను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీసీ కంపెనీ వారు రూ.25 లక్షలతో స్వయంగా స్టడీ హాల్ నిర్మించడం సంతోషకరం అన్నారు. పరిశ్రమల సహాయంతో పాఠశాలలో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 8, 2024

సంగారెడ్డి: ‘విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి’

image

విద్యార్థులకు అన్ని చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ రత్న ప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు.

News November 7, 2024

మునిపల్లి: చికిత్స పొందుతూ గురుకులం ప్రిన్సిపల్ మృతి

image

మునిపల్లి మండలం బుదేరా సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ అర్చన(36) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బుధవారం రోడ్డు ప్రమాదానికి గురైన అర్చనకు గుండెపోటు వచ్చింది. వెంటనే లింగంపల్లిలోని ప్రైవేట్ చికిత్సకి తరలిచంగా చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆమె స్వస్థలం HYD మలక్ పేటలోని అజంతా కాలనీ. అర్చన భర్త ప్రవీణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్ఐ రాజేష్ నాయక్ తెలిపారు.

News November 7, 2024

పటాన్‌చెరు: సంస్థాగత ఎన్నికల పర్వం-2024 రాష్ట్రస్థాయి కార్యశాల

image

బీజేపీ తెలంగాణ సంస్థాగత ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలను సిద్ధం చేయడానికి కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సికింద్రాబాద్ రాజరాజేశ్వరి గార్డెన్స్‌లో గురువారం సంస్థాగత ఎన్నికల పర్వం-2024 రాష్ట్రస్థాయి కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు గోదావరి అంజిరెడ్డి, బీజేపీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.